చిత్తూరు

బడుగు, బలహీన వర్గాలవారి ఆశాజ్యోతి డాక్టర్ బీఆర్ అంబేద్కర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్యవేడు, ఆగస్టు 17: బడుగు, బలహీన వర్గాల వారి ఆశాజ్యోతి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలని ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు స్పష్టం చేశారు. శుక్రవారం మండల పరిధిలోని కేవీఎం అగ్రహారంలో స్థానిక దళిత సంఘ నేతలు నూతనంగా ఏర్పాటుచేసిన అంబేద్కర్ విగ్రహాన్ని జూపూడి ప్రభాకర్‌రావు ప్రారంభించారు. ఈసందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, దళితుల ఆరాధ్యుడు అంబేద్కర్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. రాష్ట్రప్రభుత్వం బడుగుల సంక్షేమం కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నదని, వాటిని సక్రమంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్టీ, ఎస్టీ, బీసీ ఉపప్రణాళిక ద్వారా కోట్లాది రూపాయలను బడుగు వర్గాలకు చెందిన యువతీ యువకులకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరుచేసినట్లు పేర్కొన్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా బడుగు వర్గాలకు చెందిన యువత సంక్షేమం కోసం చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు సబ్సిడీ రుణాలు మంజూరుచేసినట్లు ఆయన పేర్కొన్నారు. బలహీన వర్గాలకు చెందిన యువకులు ప్రభుత్వం మంజూరు చేస్తున్న స్వయం ఉపాధి రుణాలను సక్రమంగా వినియోగించుకుంటూ కుటుంబ జీవన పరిస్థితులను మెరుగుపరచుకోవాలన్నారు. రాష్ట్ర విభజన ప్రక్రియ వలన ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బలహీన వర్గాల సంక్షేమం కోసం అధిక మొత్తంలో నిధులు మంజూరుచేసినట్లు చెప్పారు. పేదవర్గాలకు సంబంధించిన విద్యార్థులు విదేశీ విద్యను అభ్యసించేదానికి సైతం ప్రభుత్వం నిధులు మంజూరుచేస్తూ ప్రోత్సహిస్తుందని, వీటిని వినియోగించుకోవాల్సిన అవసరం బడుగులపై ఉందన్నారు. ప్రతి ఒక్కరూ విద్య, ఉద్యోగ రంగాలలో రాణించాలంటే పేదరికం అడ్డుకాదని, ప్రభుత్వ సహకారంతో పట్టుదలతో శ్రమిస్తే ఉన్నత స్థాయిలో రాణించేందుకు అవకాశం ఉందన్నారు. బడుగులు వ్యక్తిగతంగా అభివృద్ధి చెందుతూ తమవర్గానికి చెందిన వారిని ఆదుకునేందుకు కృషిచేయాల్సిన అవసరం ఉందన్నారు. చెడు అలవాట్లను విడనాడి మంచి పౌరులుగా ఎదుగుతూ సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. ఈకార్యక్రమంలో పలువురు దళిత సంఘే నేతలు, స్థానిక రాజీకయ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

స్మార్ట్‌సిటీ పనులు వేగవంతం చేయండి
* జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ఆదేశం
తిరుపతి, ఆగస్టు 17: తిరుపతి స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న అధికారులను ఆదేశించారు. తిరుపతి స్మార్ట్‌సిటీ ప్రాజెక్టుపై స్థానిక తుడ కార్యాలయంలో అంతర్గత సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు రూపకల్పనలో ఆలస్యం లేకుండా పనులు ప్రారంభించే విధంగా చూడాలన్నారు. వేస్ట్ వాటర్ మేనేజ్‌మెంట్, ఈ వెహికల్స్, స్పోర్ట్స్ అరేనా, స్మార్ట్‌స్ట్రీట్, మోడరైజేషన్ ఆప్ మున్సిపల్ స్కూల్స్, 24/7 నీటి సరఫరాపై చర్చించారు. ఈనెల 24న 740కిలోవాట్స్ సోలార్ రూఫ్‌టాప్, 3పార్కుల అభివృద్ధి పనులు ప్రారంభం అవుతాయని కార్పొరేషన్ కమిషనర్ విజయరామరాజు కలెక్టర్‌కు వివరించారు. ప్రధానంగా తిరుపతి పట్టణం అందంగా తీర్చిదిద్దే ప్రణాళికపై చర్చ సాగింది. ఈ సమీక్షలో కార్పొరేషన్ కమిషనర్ విజయరామరాజు, జేసీ గిరీషా, తుడా సెక్రటరీ మాధవీలత, ఎంఈ చంద్రశేఖర్, డెలాయిట్, ఏఈ కం ప్రాజెక్టు రూపకల్పన ప్రతినిధులు పాల్గొన్నారు.