చిత్తూరు

సమాజాన్ని ముందుకు నడిపే కథలు రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 30: సమాజాన్ని ముందుకు నడిపించే కథలు రావాలని అరసం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ యువ రచయితలకు పిలుపునిచ్చారు. స్థానిక వరదరాజనగర్‌లోని జె.సి.ఆర్. చైతన్య పాఠశాల్లో యువ కథారచయితలకు కథలబడి కార్యశాలను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా 40మంది యువ కథ రచయితలకు రెండురోజులపాటు కథాసాహిత్యంపై శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కథానిక-శిల్పం గురించి పాపినేని శివశంకర్, కథారచన-వాస్తవికత-కాల్పనికత అనే అంశంపై అట్టాడ అప్పలనాయుడు, తెలుగు కథ-జనజీవితం గురంచి డి.రామచంద్రరాజు వివరించారు. ఈకార్యక్రమంలో కథలబడి ప్రిన్సిపాల్, కేంద్రసాహితీ అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి, రచయిత సుంకోజి దేవేంద్రాచారి, రాసాని, కేంద్ర సాహిత్యయువ పురస్కార గ్రహీత అప్పిరెడ్డి హరినాథరెడ్డి, అరసం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సాకం నాగరాజు, కార్యదర్శి వల్లూరి శివప్రసాద్, గంటామోహన్, మురళి,శశిధర్‌రాజు, కడియాల వెంకటరమణ, శ్రీమన్నారాయణ, రాజేశ్వరమ్మలు పాల్గొన్నారు.