క్రైమ్/లీగల్

చీటీల పేరుతో కుచ్చుటోపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, సెప్టెంబర్ 4: చీటీల పేరుతో కోట్లాది రూపాయలు దండుకొని చీటీల నిర్వాహకుడు ఉడాయించిన సంఘటన చిత్తూరు నగరంలో ఆలస్యంగా వెలుగు చూసింది. దీంతో మంగళవారం బాధితులు ఆందోళనకు దిగి చివరకు పోలీసులను ఆశ్రయించారు. వివరాలిలా ఉన్నాయి. చిత్తూరు నగరంలో ప్రైవేట్ పాఠశాల నిర్వాహకుడు నాగరాజు గత కొంత కాలంగా నగరంలో చీటీలు, ఫైనాన్స్ నడిపేవాడు. నాగరాజు అందరితో నమ్మకంగా ఉంటూ చీటీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో నగరవాసులు అనేకమంది అతని వద్ద పెద్దఎత్తున చీటీలు వేశారు. కొంతకాలం వరకు ఈ కార్యక్రమాలు సజావుగా సాగినా తదుపరి ఇది బెడిసి కొట్టడంతో చీటీలు ఎత్తిన వారికి నగదును సకాలంలో చెల్లించలేని పరిస్థితి నెలకొంది. గత కొంతకాలంగా చీటీలు ఎత్తిన వారికి ఎంతకీ డబ్బులు చెల్లించకపోవడంతో నాగరాజుపై ఒత్తిడి ఎక్కువైంది. వారి వత్తిడిని భరించలేక నాగరాజు నగరం నుంచి అదృశ్యమయ్యాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న బాధితులు మంగళవారం ఆయనకు సంబంధించిన విద్యాసంస్థ ఎదుట ఆందోళనకు దిగారు. తమకు నాగరాజును అప్పగించాలని పట్టుపట్టారు. నాగరాజు వ్యవహారం తమకు తెలియదని విద్యాసంస్థ సిబ్బంది చెప్పడంతో చేసేదిలేక బాధితులు పోలీసులను ఆశ్రయించారు. నాగరాజు సుమారు రూ.3 కోట్లు వరకు బాధితులకు చెల్లించాల్సి ఉందని సమాచారం. అయితే పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు తెలిసింది.