చిత్తూరు

సింహ వాహనసేవలో ఆధ్యాత్మిక పుస్తకాల ఆవిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 15: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన శనివారం ఉదయం సింహ వాహనసేవలో నాలుగు ఆధ్యాత్మిక పుస్తకాలను ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో ధర్మకర్తల మండలి అధ్యక్షులు పుట్టా సుధాకర్ యాదవ్, ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, ధర్మకర్తల మండలి సభ్యుడు మేడా రామకృష్ణారెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు రాఘవేంద్రరావు, ప్రచురుణల విభాగం ప్రత్యేకాధికారి ఆంజనేయులు, ఉప సంపాదకులు డాక్టర్ నొస్సం నరసింహాచార్య ఇతర అధికారులు పాల్గొన్నారు. శ్రీ సాధు సుబ్రమణ్యం ఆంగ్లభాషలో రచించిన తిరుపతి శ్రీవేంకటేశ్వర గ్రంథాన్ని డాక్టర్ ఎస్.లక్ష్మమూర్తి, డాక్టర్ సి.సుబ్బారావ్, డాక్టర్ టి.విశ్వనాథరావ్ కలిసి తెలుగులోకి అనువదించారు. దేవస్థానం శాసనాధ్యయన నిపుణుడైన సాధుసుబ్రమణ్యం శాస్ర్తీ రచించిన ఈ గ్రంథం 1981లో ముద్రితమైంది. డాక్టర్ కె.వీ.రాఘవాచార్య శ్రీ వేంకటేశ్వర స్తోత్రమాల గ్రంథాన్ని రచించారు. శ్రీహరి దశావతార మహిమలు, కలియుగంలో శ్రీమన్నారాయణుని అర్చావతారమైన శ్రీనివాసుని దివ్యలీలావైభవం ఉన్నాయి. ఈ స్తోత్రకర్తలలో బ్రహ్మ, రుద్ర, ఇంద్రాది దేవతలు, శుక, అగస్త్య, మార్కండేయాది మహర్షులు, తొండమనాడు, దేవశర్మ, క్మురి భీముడు తదితర ఎందరో భక్తులు ఉన్నారు. ఉదంకోపాఖ్యానం మహాభారతంలోని ఆదిపర్వంలోనిది. ఈ ఉపాఖ్యానాకి డాక్టర్లు దివాకర్ల వేంకటావధాని వ్యాఖ్యానాన్ని అందించగా డాక్టర్ ఆశావాది ప్రకాశరావు పీఠికను సంతరించారు. మహాభారతంలోని కర్ణపర్వంలోని ‘‘ హంసకాకీయోపాఖ్యానం’’ అనే ఈ ఉపాఖ్యానానికి డాక్టర్ ఎస్.వి.రామారావు వ్యాఖ్యానాన్ని అందించగా, డాక్టర్ కె.జె.కృష్ణమూర్తి పీఠికను సంతరించారు. ఈ ఘట్టంలో హంస, కాకి ఈరెండు పక్షులు ప్రధానపాత్రలు. వైశ్యశ్రేష్ఠుని ఇంట ఎంగిలి మెతుకులు తిని కొవ్వుపట్టి గర్వించిన కాకి తన శక్తి తెలుసుకోలేక వైష్యుని కుమారుల మాటలకు ఉబ్బిపోయి హంసతో ఆకాశయానంలో పోటీపడి ఓటమిపాలై చివరకు హంసచేతనే రక్షింపబడుతుంది. ఇందులోని కథాంశం. ఈ నాలుగు పుస్తకాలను సింహ వాహనసేవ ముందు భాగాన ఆవిష్కరించారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కనులవిందుగా కళాప్రర్శనలు
తిరుపతి, సెప్టెంబర్ 15: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల వాహన సేవల్లో స్వామివారి వైభవాన్ని వ్యాప్తి చేసేలా ఆయా ప్రాజెక్టుల ఆధ్వర్యంలో కనులవిందుగా కళాప్రదర్శనలు ఏర్పాటు చేశామని టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యులు, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు ఆచార్య విశ్వనాథ్, ఎస్వీ సంగీత కళాశాల ప్రిన్సిపాల్ వైవిఎస్.పద్మావతి, ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ప్రత్యేక అధికారి డాక్టర్ వి.జి.చొక్కలింగం తెలిపారు. తిరుమలలోని మీడియా సెంటర్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆనంద తీర్థాచార్యులు మాట్లాడుతూ తమ ప్రాజెక్టు తరపున 900 మందికి పైగా కళాకారులు ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రదర్శనలిస్తున్నట్లు తెలిపారు. పురందరదాస రచించిన సంకీర్తనల అర్థాన్ని వివరిస్తూ నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశామన్నారు. హరిదాసులు అందించిన సందేశాన్ని నాదనీరాజనం వేదికపై ప్రముఖ పండితులు ధార్మికోపన్యాసం చేస్తున్నారని చెప్పారు. మహతి కళాక్షేత్రంలో యక్షగానం కళారూపాన్ని ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. సిడీలు, పుస్తక ముద్రణ, సదస్సుల నిర్వహణ , భజన బృందాల ద్వారా పురందరదాస కీర్తనలను వ్యాప్తి చేయడంతోపాటు ధర్మప్రచారం చేస్తున్నట్లు వివరించారు. ఆచార్య విశ్వనాథ్ మాట్లాడుతూ వాహనసేవల ముందు వివిధ కళాప్రదర్శనలతోపాటు మాడ వీధుల్లో ఏర్పాటు చేసిన వేదికలపై అనమయ్య సంకీర్తనలను కళాకారులు ఆలపిస్తున్నట్లు చెప్పారు. నాదనీరాజనం వేదికపై నిర్వహిస్తున్న అన్నమయ్య విన్నపాలు కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. తిరుపతిలో మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరం, రామచంద్ర పుష్కరిణిలో ప్రాజెక్టు కళాకారులచే సంగీత, నృత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఎస్వీసంగీత కళాశాల ప్రిన్సిపాల్ పద్మావతి మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల, తిరుపతిలోని పలు వేదికలపై తమ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు సంగీత, నృత్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నారు. నాదనీరాజనం వైదికపై శ్రీ తాళ్లపాక అన్నమయ్య, త్యాగరాజ స్వామి, ముత్తుస్వామి దీక్షితులు రచించిన కీర్తనలతో గాత్ర, వాద్య, నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ప్రత్యేక అధికారి డాక్టర్ వి.జి.చొక్కలింగం మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల వాహన సేవల్లో ప్రముఖ పండితులతో తమిళంలో వ్యాఖ్యానాలు అందిస్తున్నామని, నాద నీరాజనం వేదికపై ప్రవచన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. వాహనసేవల్లో నిర్వహిస్తున్న జీయంగార్ల గోష్టిలో రోజుకో ప్రబంధాన్ని స్వామివారికి నివేదిస్తారని వివరించారు. తమ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆళ్వార్ల పాశురాలను, అందులోని భక్తితత్వాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ప్రజాసంబంధాల అధికారి డాక్టర్ టి.రవి పాల్గొన్నారు.