క్రైమ్/లీగల్

సీఐ లైంగిక వేధింపుల కేసు విచారణకు ఆదేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, సెప్టెంబర్ 22: వాల్మీకిపురం సీఐ తేజామూర్తి లైంగిక వేధింపుల కేసు విచారణకు జిల్లా ఎస్పీ రాజశేర్ బాబు శనివారం ఆదేశాలు జారీ చేసారు. విచారణ అధికారిగా చిత్తూరు మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ నారాయణ స్వామిని నియమించారు. వాల్మీకిపురం సీఐగా ఉన్న తేజామూర్తి ఇటీవల లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఒక మహిళ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. పోలీసు అధికారులు ఇటీవల అతనిపై సస్పెన్షన్ వేటు వేసారు. దీనిపై సమగ్రంగా విచారణ జరిపి వివరాలు త్వరితగతిన అందజేయాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. పీలేరుకు చెందిన ఓ మహిళ తన భర్తతో వివాదంపై పీలేరు పోలీసు స్టేషన్‌లో గతంలో ఫిర్యాదు చేసింది. ఆసమయంలో తేజమూర్తి అక్కడ ఇన్ ఛార్జి సీఐగా ఉండి కేసు దర్యాప్తుచేపట్టారు. కొంత పరిచయం ఏర్పడిన కారణంగా తిరుమల బ్రహ్మోత్సవాల విధుల్లో ఉన్న సీఐ, ఆమహిళను తిరుమలకు రావాలని వాట్స్‌ప్ ద్వారా సమాచారం ఇచ్చాడు, ప్రత్యేకంగా తిరుమలలో రూమ్ కూడా తీసుకొన్నట్లు తెలిపాడు. దీంతో ఆ మహిళ సీఐ భరతం పట్టాలని పక్కాప్రణాళికలతో పలువురు మహిళా సంఘాల సభ్యులతో తిరుమలు వెళ్లి, అక్కడ సెల్‌ఫోన్ ఛాటింగ్ ఆధారాలతో పోలీసు ఉన్నతాధికారుకు ఫిర్యాదు చేసింది. తిరుమలలో బ్రహోత్సవాలు జరుగుతున్న పవిత్ర వేళ అందులోనూ తిరుమలలో విధుల్లో ఉంటూ సీఐ చేసిన నిర్వాకాలపై అనంతపురం రేంజి డీఐజీ తీవ్రంగా స్పందించి అతనిపై వేటు వేసిన సంగతి తెలిసిందే, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు శనివారం జిల్లా ఎస్పీ విచారణకు అదేశించి ప్రత్యేంగా అధికారిని నియమించారు.