చిత్తూరు

యువత ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలమనేరు, సెప్టెంబర్ 24: యువత ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పరిశ్రమలశాఖా మంత్రి అమరనాథ్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం పలమనేరు డిగ్రీకళాశాల మైదానంలో టీ ఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్యమంత్రి యువనేస్తం అవగాహన అభినందన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంతో ముందు చూపుతో యువతకు చేయూతనివ్వడానికే ఈకార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. పలు రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం సరైన అవగాహన లేకుండా అమలులో జాప్యం జరుగుతుందన్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఐటీ మంత్రి నారాలోకేష్ సుదీర్ఘంగా ఆలోచించి ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి చర్యలు చేపట్టారన్నారు. కార్యక్రమాన్ని రాష్ట్రంలో పకడ్భందీగా ఆదర్శవంతంగా అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. యువతకు నిరుద్యోగ భృతితోపాటు నైపుణ్యాభివృద్ధిపై కూడా శిక్షణాకార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. ప్రపంచ దేశాల్లో సుమారు 30శాతం మంది మన రాష్ట్రానికి చెందిన యువతీ యువకులు వివిధ రంగాల్లో పనిచేస్తున్నారని చెప్పారు. విద్యతో పాటు పలు అంశాల్లో యువత నైపుణ్యాన్ని సాధిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. నేడు అతిపెద్ద కంపెనీలకు సీఈఓలుగా కూడా మన తెలుగు వారు ఉన్నారని తెలిపారు. ముఖ్యంగా ప్రతి ప్రధాన నగరాల్లో తొమ్మిది పాలసీలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని, ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క పాలసీ అమలు కానున్నట్లు చెప్పారు. అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీ అయిన కియో మోటార్స్ పరిశ్రమ అనంతపురంలో ఏర్పాటు చేయడంతో 1500మందికి ఉపాధి కల్పించే విధంగా చర్యలు చేపట్టామన్నారు. ఈసందర్భంగా టిఎన్ ఎస్‌ఎఫ్ సమన్వయకర్త రవినాయుడు మాట్లాడుతూ యువత అభివృద్ధికి, సంక్షేమానికి కృషి చేస్తున్న రాష్ట్ర మంత్రి అమరనాథ్‌రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నిరుద్యోగభృతిని తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించడం హర్షనీయమన్నారు. ఈకార్యక్రమంలో టిఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆనందగౌడు, జిల్లా పార్టీ కోశాధికారి ఆర్‌వి బాలాజీ, మార్కెట్ కమిటీ చైర్మన్ హేమంత్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఛాన్‌బాషా, పట్టణ టీడీపీ అధ్యక్షులు సుధీర్‌కుమార్, నేతలు శ్రీ్ధర్, బాలసుబ్రమణ్యం, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి సమక్షంలో పలువురు టీడీపీలో చేరిక
పలమనేరు మండలానికి చెందిన పలువురు వైకాపా నాయకులు సోమవారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మంత్రి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. నియోజకవర్గంలో మంత్రి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు అభినందనీయమని, ఆయన నాయకత్వంలో పనిచేయడానికి పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. మొరం పంచాయతీ నక్కనపల్లి గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి, చక్రపాణిరెడ్డి, సుబ్బారెడ్డి, కుర్రపల్లికి చెందిన సుధాకర్ వారి అనుచరులతో కలసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి మంత్రి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈకార్యక్రమంలో నాయకులు సుబ్రమణ్యంనాయుడు, వెంకటమునిరెడ్డి, రవీంద్రనాయుడు, ద్వారకనాధరెడ్డి, వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.