క్రైమ్/లీగల్

బైక్‌పై నుంచి పడి ఒకరు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్యవేడు, అక్టోబర్ 4: ద్విచక్ర వాహనం నడుపుతూ రోడ్డుకు అడ్డుగా పంది రావడంతో తప్పించబోయి అదుపుతప్పి కిందపడటంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందిన సంఘటన మండల పరిధిలోని వీఆర్ కండ్రిగ గ్రామశివారులో బుధవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. వీఆర్ కండ్రిగకు చెందిన సుబ్రహ్మణ్యం, శంకర్‌లు తమ సొంత పనుల నిమిత్తమై సత్యవేడుకు వచ్చి తిరుగుప్రయాణంలో వీఆర్ కండ్రిగకు వెళుతుండగా అడ్డుగా వచ్చిన పందిని తప్పించబోయి కిందపడటంతో శంకర్ (38) తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడేమృతి చెందాడు. ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న సుబ్రహ్మణ్యం (35)కు తీవ్రగాయాలయ్యాయి. దీనిని గమనించిన స్థానికులు 108కు సమాచారాన్ని అందించడంతో సుబ్రహ్మణ్యంను సత్యవేడు ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. శంకర్ మృతదేహాన్ని పంచనామా నిమిత్తం సత్యవేడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శంకర్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడు దాసుకుప్పంలోని ఓ బ్రాందీషాపులో క్యాషియర్‌కాగా, గాయాలైన సుబ్రహ్మణ్యం వంటమాస్టర్‌గా పనిచేస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

మేయర్ దంపతుల హత్య కేసు విచారణకు షెడ్యూల్ ఖరారు
చిత్తూరు, అక్టోబర్ 4: చిత్తూరు నగర పాలక సంస్థ మేయర్ కఠారి అనూరాధ, ఆమె భర్త కఠారి మోహన్ హత్య కేసు విచారణకు సంబంధించి షెడ్యూల్‌ను చిత్తూరు 9వ అదనపు జడ్జి కపర్థి ఖరారు చేశారు. 2015 నవంబర్ నెలలో నగర పాలక సంస్థ కార్యాలయంలోనే మేయర్ అనూరాధ, ఆమె భర్త కఠారిమోహన్ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈసంఘటన దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈనేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి అప్పట్లో 16మందిని నిందితులుగా చేశారు. ప్రస్తుతం ఈ కేసులో ప్రధాన నిందితుడైన చింటూ, ఈ కేసుతో పాటు మిగతా కేసుల వ్యవహారంగా రిమాండ్‌లోనే ఉన్నారు. ఈ తరుణంలో ఈ కేసును త్వరగా విచారించాలన్న దృక్పదంతో న్యాయమూర్తి కేసు విచారణకు షెడ్యూలు విడుదల చేస్తూ ఈనెల 29న కేసు విచారణ చేయనున్నట్లు ఖరారు చేశారు. ఈకేసులో భాగంగా సుమారు వంద మందికి పైగా సాక్షులను దశలవారీగా విచారిస్తున్నారు. కేసును త్వరగా పరిష్కరించాలన్న ఉద్దేశంతో ఈ షెడ్యూలు ఖరారైంది.