చిత్తూరు

నాదనీరాజనం వేదికపై సాంస్కృతిక శోభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 14: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా నాదనీరాజనం వేదికపై ఆదివారం నిర్వహించిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు, శ్రీవేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల, శ్రీవేంకటేశ్వర వేదపాఠశాల సంయుక్త ఆధ్వర్యంలో తిరుమలలోని నాదనీరాజనం వేదిక, ఆస్థానమండపంలో ధార్మిక, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా నాదనీరాజనం వేదికపై ఉదయం ఈశ్వరయ్య, శ్రీనివాస్ బృందం మంగళధ్వని, తిరుమల ధర్మగిరి వేదపాఠశాల విద్యార్థులు చతుర్వేద పారాయణం నిర్వహించారు. అదే విధంగా తిరుపతికి చెందిన హిమవతి బృందం విష్ణుసహస్రనామ పారాయణం, డోన్‌కు చెందిన దత్తాత్రేయ శర్మ ధార్మికోపన్యాసం చేశారు. సాయంత్రం కోయంబత్తూరుకు చెందిన కోవై గౌతమ్ బృందం నామసంకీర్తనలో పలు సంకీర్తనలను రసరమ్యంగా గానం చేశారు. అనంతరం ఊంజల్‌సేవలో తిరుపతికి చెందిన రఘునాథ్ పలు అన్నమయ్య సంకీర్తనలను చక్కగా ఆలపించారు. అదే విధంగా తిరుమలలోని ఆస్థానమండపంలో ఆదివారం ఉదయం తిరుపతిలోని ఎస్వీ సంగీత నృత్య కళాశాల అధ్యాపకురాలు డాక్టర్ వందన బృందం భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించారు.

మన్నవరం మూసివేయడం లేదు
* స్పష్టం చేసిన కేంద్ర ఇంధన శాఖ మంత్రి
తిరుపతి, అక్టోబర్ 14: చిత్తూరు జిల్లాలో ఎంతోమందికి ఉపాధి చూపనున్న మన్నవరం ప్రాజెక్టును తరలించడం సరికాదని కేంద్ర ఇంధన, పునరుత్పాదక విద్యుత్ శాఖామంత్రి ఆర్‌కె సింగ్‌ను కలసి వినతిపత్రం సమర్పించగా, ఎటువంటి పరిస్థితుల్లోనూ మన్నవరం ప్రాజెక్టును మూసే ప్రసక్తేలేదని స్పష్టం చేసినట్లు మన్నవరం పరిరక్షణ కమిటీ నాయకులు తెలిపారు. మన్నవరం పరిరక్షణ వేదిక నాయకులు మాజీ ఎంపీ వరప్రసాద్, రాయపనేని హరికృష్ణ, రాజారెడ్డి, సంక్రాంతి వెంకటయ్య, వెంకటరత్నం, మహ్మద్ రఫీలు ఆదివారం రేణిగుంట విమానాశ్రయంలో కేంద్రమంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. మన్నవరం ఫ్యాక్టరీకి నిధులిచ్చి పూర్తిస్థాయిలో ఉత్పత్తి కొనసాగించాలని కోరారు. ఫ్యాక్టరీ మూతవేసే ప్రచారం సాగుతోందని ఆయన దృష్టికి తీసుకువచ్చామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మూసివేసే పరిస్థితే లేదని స్పష్టం చేశారన్నారు. మన్నవరం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కలల ప్రాజెక్టు అని, మేము అధికారంలోనికి వస్తే ఈ ప్రాజెక్టును ఈక్విటీ ఇచ్చి పునఃప్రారంభిస్తామని మాజీ ఎంపీ వరప్రసాద్ తెలిపారు. కేంద్రమంత్రి ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే వర్షాకాల పార్లమెంట్ సమావేశాల సందర్భంలో ఢిల్లీలో పోరాటాలు చేస్తామని పరిరక్షణ వేదిక నాయకులు హెచ్చరించారు.