చిత్తూరు

నానిని గెలిపించుకోవడమే మనందరి సంకల్పం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 14: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుండి పులివర్తి నానిని గెలిపించుకోవడమే సంకల్పంగా చేపట్టి కార్యోన్ముఖులు కావాలని, ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేయాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గల్లా అరుణకుమారి, ఎంపీ డాక్టర్ శివప్రసాద్‌లు టీడీపీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. తిరుపతి రూరల్‌మండలం జీఆర్‌ఆర్ కల్యాణ మండపంలో ఆదివారం చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం జరిగింది. మొదటగా ఎన్‌టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పొలిట్‌బ్యూరో సభ్యురాలు గల్లా అరుణకుమారి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పులివర్తి నాని పేరును పరిశీలిస్తున్నానని చెప్పగానే అతనే సరైన వ్యక్తి అని తాను చెప్పడం జరిగిందన్నారు. గతంలో కాకుండా ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు కష్టపడి పనిచేయాలన్నారు. నియోజకవర్గంలో 95శాతం నాయకుల కంటే 5శాతం నాయకులతోనే ప్రమాదమని హెచ్చరించారు. ప్రస్తుతం నియోజకవర్గంలో టీడీపీ పటిష్టంగా ఉందని, బడాబాబులను, పారిశ్రామిక వేత్తలను దరి చేరనివ్వకుండా సాధారణ నాయకులు, కార్యకర్తలను ఆదరిస్తే గెలుపు ఖాయమన్నారు. చిత్తూరు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ శివప్రసాద్ తన ప్రసంగంలో ఆద్యంతం సభను రక్తికట్టించారు. తనదైన శైలిలో చంద్రబాబు శక్తియుక్తులను చాటుతూనే ప్రతిపక్షాలపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ నాయకులు, కార్యకర్తలను ఉత్తేజపరిచారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబునాయుడును ఏ శక్తి అడ్డుకోలేవని డాక్టర్ శివప్రసాద్ అన్నారు. రాష్ట్రంలో టీడీపీ అభ్యర్థులు అఖండ విజయం సాధించడం ఖాయమని, చంద్రబాబునాయుడు మరోమారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం తధ్యమన్నారు. బీజేపీ, వైకాపా, జనసేన లాంటి పార్టీలు ఎన్ని ఉన్నా చంద్రబాబునాయుడుపై ప్రజలకున్న ఆదరణ ముందు జూజూ అన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన గల్లా అరుణకుమారి చంద్రగిరి నుండి తప్పుకోవడం, నగరిలో ముద్దుకృష్ణమనాయుడు మృతి చెందడంతో పార్టీ పరిస్థితి గురించి కొంత కలత చెందానన్నారు. అయితే గల్లా అరుణకుమారి చంద్రగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు నాని పేరును సూచించడం సంతోషకరమన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు అందరూ కలసిమెలసి పనిచేయాలన్నారు. చిన్నచిన్న మనస్పర్థలు ఉన్నా వాటిని పక్కన పెట్టి నాని గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. జిల్లాలో పార్టీ పటిష్టతకు గల్లా అరుణకుమారి సేవలు అవసరమన్నారు. ఇప్పుడు నాయకులు, కార్యకర్తలు చూపిస్తున్న ఉత్సాహం నాని గెలుపు వరకు కొనసాగాలన్నారు. చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి పులివర్తి నాని మాట్లాడుతూ గల్లా అరుణకుమారి, ఎంపీ శివప్రసాద్‌ల సలహాలు, సూచనలు తీసుకుంటూ నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటానన్నారు. మీరు, నేను, మనందరం కలసికట్టుగా పనిచేసి చంద్రగిరిలో టీడీపీ జెండాల ఎగిరేలా కష్టపడి పనిచేయాలన్నారు. పక్కనే ఉంటూ పార్టీకి ద్రోహం చేయాలని చూసే వారిని ఉపేక్షించేది లేదన్నారు. ఆరు మండలాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఎంతో అనుభవం కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మన రాష్ట్రానికి ఉండటం మన బలమన్నారు. ఆయన ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి టీడీపీ విజయానికి బాటలు వేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో తుడా చైర్మన్ నరసింహయాదవ్, టీడీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు పుష్పావతి, రూరల్ నాయకులు చెరుకుల జనార్దన్‌యాదవ్, జడ్పీటీసీ సురేష్, శ్రీ్ధర్‌నాయుడు, కొమ్మినేని సురేంద్రనాయుడు, టీఎన్‌ఎస్‌ఎఫ్ జాతీయ సమన్వయకర్త రవినాయుడు, కేశవులునాయుడు, గంగపల్లి భాస్కర్, అమ్ములు, సుశీలమ్మ, వాసు, పలుకూరి ధనంజయులునాయుడు, మల్లెమొగ్గల ఉమాపతి, టీఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా అద్యక్షులు ఆనంద్, రామారావు, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.