చిత్తూరు

వెంకయ్య వ్యక్తిగత ఆస్తులు కాపాడలేదనే సీపీఐకి రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 14: తన వ్యక్తిగత ఆస్తులకు సంబంధించి తలెత్తిన వివాదాలన్నింటికీ కమ్యూనిస్ట్ పార్టీ అండగా నిలవలేదన్న ఏకైక కారణంతోనే ఆర్.వెంకయ్య సీపీఐకి రాజీనామా చేశారని, పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు జరిగిన కుట్రలో ఈ తంతు ఒక భాగమని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎ.రామానాయుడు ఆరోపించారు. సీపీఐ సీనియర్ నేత, జిల్లా రైతు సంఘ నాయకుడు ఆర్.వెంకయ్య రాజీనామాపై జిల్లా పార్టీ తీవ్రంగా స్పందించింది. ఇటీవల కాలంలో సీపీఐలో ఆధిపత్య పోరు జరుగుతుందనే క్రమంలో వెంకయ్యతో పాటు మరో 100 మంది రాజీనామాచేయడం పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. మొన్నటి వరకు వామపక్ష పార్టీల మధ్య కారణాలేవైనా అభిప్రాయభేదాలు తలెత్తిన విషయం పాఠకులకు విదితమే. తాజాగా పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగుతున్న నాయకుల మధ్యకూడా విభేదాలు తలెత్తడం కార్మిక వర్గాలలో అభద్రతా భావం నెలకొనే అవకాశం లేకపోలేదని రాజకీయ పరిశీలకులు విశే్లషిస్తున్నారు. ఇదిలా ఉండగా జిల్లా కార్యదర్శి రామానాయుడు ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ వెంకయ్య పార్టీ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారన్న కారణంతో ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నామన్నారు. ఇక అలాంటి పొరపాట్లు జరగవని, పార్టీలో కొనసాగుతానని, సంజాయిషీ లేఖ ఇచ్చిన తరువాత ఆయనను పార్టీలోకి తీసుకున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే ఆయనను ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులుగా కూడా నియమించామని, ఆయన కార్యక్రమాలలో కూడా పాల్గొన్నారన్నారు. ఈనెల 12న కలెక్టరేట్ ఎదుట రైతు సంఘం ఆధ్వర్యంలో జరిగిన ధర్నాకు కూడా ఆయన నాయకత్వం వహించారన్నారు. అప్పటి వరకు పార్టీలో అన్నీ సక్రమంగా ఉన్నాయని, నాయకులు గొప్పగా సేవలందిస్తున్నారని అనుకున్న వెంకయ్య హఠాత్తుగా ఈ రాజీనామా నిర్ణయం తీసుకోవడం ఒక కుట్ర అని అభివర్ణించారు. కొన్ని శక్తుల ప్రేరణతోనే ఆయన రాజీనామా చేశారన్నారు. పార్టీలో సభ్యులు కాని వారిని కూడా ప్రెస్‌క్లబ్‌కు తీసుకొచ్చి విలేఖరుల సమావేశం పెట్టడం ఆయన నిబద్దతకు అద్దం పడుతోందని ఎద్దేవాచేశారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అండదండలతో అంచెలంచెలుగా ఎదిగిన వెంకయ్య నేడు ఆయనపై విమర్శలు గుప్పించడం ఆయన అవకాశవాద రాజకీయాలకు అద్దం పడుతోందని నిప్పులు చెరిగారు. గంధమనేని శివయ్య, కృష్ణారెడ్డి మెమోరియల్ సొసైటీ లెక్కలు తేల్చడం లేదని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఆ ట్రస్టుకు కన్వీనర్ వెంకయ్య అని, లెక్కలు ఎవరికి చెప్పాలని నిలదీశారు. తిలక్‌రోడ్డులో ఉన్న ఐసీఐసీఐ బ్యాంకు భవనం వివాదాస్పదంగా ఉన్నపుడు సీపీఐ ఆయనకు అండగా నిలబడి సమస్యలను పరిష్కరించిన మాట వాస్తవం కాదా అని నిలదీశారు. తిరుమలలో పార్టీపేరు చెప్పుకొని వెంకయ్య లక్షలు గడిస్తున్నారని ఆరోపించారు. ఇటీవల రెడ్డ్భీవన్ వద్ద అన్నా రామకృష్ణయ్యకు సంబంధించి వెంకయ్యకు భూవివాదం ఏర్పడిందన్నారు. ఈ వివాదంలో సీపీఐ నాయకులు ఆయనకు అండగా ఉండలేదన్న ఆక్రోశం వెంకయ్యలో ఉందన్నారు. ఆ వివాదానికి సంబంధించి న్యాయస్థానంలో కేసు నడుస్తోందని, తీర్పు అనుకూలంగా వస్తే పార్టీ అండగా ఉంటుందని అపుడే నాయకత్వం తేల్చిచెప్పిందన్నారు. తన వ్యక్తిగత ఆస్థులకు అండగా నిలబడలేదన్న కారణంతో పార్టీని వీడిన వెంకయ్యకు ఏ పాటి కమ్యూనిస్టు భావజాలాలున్నాయో ఎవరికైనా అర్థమవుతుందన్నారు. వాస్తవానికి పార్టీకి సంబంధించిన ఏ ఒక్క కార్యకర్త కూడా ఆయన వెంట వెళ్లలేదని, ఇప్పటికైనా తప్పుడు ప్రకటన మానుకోవాలని ఆయన హితవు పలికారు. ఈ విలేఖరుల సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచులయ్య, పి.మురళి, జె.రామచంద్రయ్య, నగర కార్యదర్శి విశ్వనాథ్, తిరుమల పార్టీ నాయకులు డి.రామచంద్రయ్య, బాలగంగయ్య, కేశవులు తదితరులు పాల్గొన్నారు.