చిత్తూరు

టీటీడీ ప్రచురణల ద్వారా విస్తృతంగా సనాతన ధర్మప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 15: టీటీడీ ప్రచురణల విభాగం ద్వారా విస్తృతంగా సనాతన ధర్మప్రచారం చేస్తున్నామని ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి డాక్టర్ తాళ్లూరి ఆంజనేయులు వెల్లడించారు. తిరుమలలోని రాంభగీచా-2లో గల మీడియా సెంటర్‌లో సోమవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ టీటీడీ ప్రచురణలను మరింత వేగవంతం చేయాలనే ఉద్దేశంతో 2011లో ప్రత్యేకంగా ప్రచురణల విభాగాన్ని ఏర్పాటుచేశారన్నారు. ధార్మిక సంబంధమైన వివిధ గ్రంథాలను ముద్రించి బ్రహ్మోత్సవాల సమయంలో ఆవిష్కరిస్తున్నామన్నారు. వాటిలో ముఖ్యంగా వేదవాజ్ఞ్మయానికి సంబంధించిన గ్రంథాలు, ఆర్షవిజ్ఞాన సర్వస్వం, వేంకటేశ్వర మహత్యం, తిరుమల క్షేత్రాన్ని పరిచయం చేసే క్షేత్రదర్శిని గ్రంథాలు, భగవత్ భక్తుల జీవిత చరిత్రలను పరిచయం చేసే బ్రహ్మమొక్కటే గ్రంథాలు ఇతర అనేక ధార్మిక గ్రంథాలను తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడం, ఆంగ్లం, సంస్కృతం భాషలలో ముద్రిస్తున్నామన్నారు. అదేవిధంగా పోతన భాగవతానికి సరళ వ్యాఖ్యానం రాయించి 8 సంపుటాలలో భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ఇప్పటి వరకు టీటీడీ పక్షాన 3,800 గ్రంథాలను ముద్రించామన్నారు. వ్యాసభారతం మూలాలను 36 సంపుటాలుగా తెలుగు, సంస్కృతం లిపిలలో త్వరలో ఆవిష్కరిస్తామన్నారు. వ్యాసభారతంను తెలుగులో తాత్పర్య సహితంగా ముద్రించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. టీటీడీ ముద్రించిన గ్రంథాలన్నీ ఈబుక్స్.తిరుమల.ఓఆర్‌జీ వెబ్‌సైట్‌లో ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. టీటీడీ పుస్తక విక్రయశాలలో గ్రంథాలన్నీ భక్తులకు అందుబాటులో ఉన్నాయన్నారు.