చిత్తూరు

పిడుగు పాటుకు ఒకరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పీలేరు, అక్టోబర్ 15: నియోజకవర్గ పరిధిలోని కేవీపల్లి మండలం దిగువవగళ్ల గ్రామం చెంచురెడ్డిగారిపల్లికి చెందిన రైతు సోమవారం పిడుగు పాటుకు గురై మృతిచెందాడు. తహశీల్దార్ మురళి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చెంచురెడ్డిగారి పల్లికి చెందిన రైతులు ఎర్రంరెడ్డి (55), వెంకటరమణారెడ్డిలు సోమవారం 3 గంటల ప్రాంతంలో పొలం వద్ద పశువులను మేపుతుండగా ఆకస్మికంగా ఉరుములతో కూడిన వర్షం రావడంతో ఓ చెట్టుకింద తలదాచుకున్నారు. ఆకస్మికంగా పిడుగు పడటంతో ఎర్రంరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకటరమణారెడ్డికి తీవ్రగాయాలు కాగా స్థానికులు హుటాహుటిన ఓ ప్రైవేటు వాహనం ద్వారా పీలేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎర్రంరెడ్డి మృతిచెందాడని, వెంకటరమణారెడ్డికి తీవ్రగాయాలు కావడంతో వైద్యులు చికిత్స చేస్తున్నట్లు తహశీల్దార్ తెలిపారు. పిడుగుపాటుకు గురైన వారి కుటుంబాల వివరాలను జిల్లా కలెక్టర్, మదనపల్లి సబ్‌కలెక్టర్‌కు నివేదించామని ఆయన పేర్కొన్నారు. వాతావరణ శాఖ హెచ్చరికలు చేసినపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. మృతి చెందిన ఎర్రంరెడ్డి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. తీవ్రగాయాలకు గురైన వెంకటరమణారెడ్డికి మెరుగైన వైద్యచికిత్సను అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.