చిత్తూరు

గజ వాహనంపై ఊరేగిన గోవిందుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 15: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజైన సోమవారం రాత్రి 7 నుండి 10గంటల వరకు గజ వాహనంపై స్వామి వారు తిరుమాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయం నుండి స్వామివారి ఉత్సవమూర్తిని వేదపండితులు, అర్చకులు వాహనమండపానికి వేంచేపు చేశారు. అక్కడ స్వామివారిని గజ వాహనంపై వేంచేపు చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి పట్టుపీతాంబరాలు, వజ్ర, వైడూర్యాలు పొదిగిన స్వర్ణ్భారణాలు, సువాసనలు వెదజల్లే రంగురంగుల వివిధ రకాల పుష్పాలతో విశేషాలంకరణలు చేశారు. సాయంత్రం 7గంటలకు భక్తుల గోవిందనామస్మరణల మధ్య విశేషాలంకార భూషితుడైన స్వామివారు వాహన మండపం నుండి వెలుపలకు వచ్చారు. వాహనం ముందు భక్తజన బృందాలు, చెక్క్భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ అంగరంగ వైభవంగా సాగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్దజీయ్యంగార్, చిన్నజీయ్యంగార్, ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, జేఈఓ శ్రీనివాసరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ. 10లక్షల విరాళం
తిరుపతి, అక్టోబర్ 15: తిరుపతికి చెందిన కె.బాలిరెడ్డి, కె.కమలాకర్ రెడ్డి టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు సోమవారం రూ. 10లక్షలు విరాళం అందించారు. స్థానిక టీటీడీ పరిపాలనా భవనంలోని సెంట్రలైజ్డ్ డోనార్ మేనేజ్‌మెంట్ కార్యాలయంలో వారు ఈ విరాళం చెక్కును అందించారు.

సరస్వతిదేవీగా కటాక్షించిన గంగమ్మ
తిరుపతి, అక్టోబర్ 15: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం తిరుపతి తాతయ్యగుంట గంగమ్మను సరస్వతీ దేవిగా అలంకరించి కొలువుదీర్చారు. ఉదయం అమ్మమారికి అభిషేకం నిర్వహించిన అనంతరం దేవీ హోమం జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమానికి తుడా చైర్మన్ నరసింహ యాదవ్, ఆలయ పాలకమండలి చైర్మన్ ఆర్.సీ.మునికృష్ణ, ఈఓ సుబ్రమణ్యం, పాలకమండలి సభ్యులు ఎ.సూర్యనారాయణ రెడ్డి, కెవిఎస్ రుషి, చెంబకూరు రాజయ్య, గెంజి సుధాకర్ రెడ్డి, దేవరాజు ఆచారి, మంగమ్మ, టీడీపీ నాయకులు మహేష్ యాదవ్, డిల్లీ బాబు తదితరులు పాల్గొన్నారు.

వినాయకుని సేవలో పలువురు ప్రముఖులు
ఐరాల, అక్టోబర్ 15: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామిని దర్శించుకునేందుకు సోమవారం రాష్ట్ర సాధన పరిపాలన కార్యదర్శి శ్రీకాంత్, విజయవాడ ఎమ్మెల్యే ఉమామహేశ్వరరావు కుటుంబ సమేతంగా విడివిడిగా విచ్చేశారు. వీరికి ఆలయ మర్యాదలతో ఆలయ కార్యనిర్వహణాధికారి పూర్ణచంద్రరావు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. మూషిక మండపంలో వేదపండితులచే ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రాలు అందజేశారు. కార్యక్రమంలో తహశీల్దార్ ప్రసాద్‌బాబు తదితరులు పాల్గొన్నారు.