చిత్తూరు

విదేశాల్లో వెట్టిచాకిరి చేస్తున్న మహిళల విముక్తికి చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, అక్టోబర్ 16: పొట్ట కూటికోసం విదేశాలకు వెళ్లి అక్కడ వెట్టి చాకిరి చేస్తున్న మహిళల విముక్తికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబు తెలిపారు. మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ బతుకుదెరువుకోసం జిల్లా నుంచి పలువురు మహిళలు గల్ఫ్ దేశాలకు వెళుతున్నారని, అక్కడ అనేక మంది వెట్టి చాకిరీ చేస్తూ పలు రకాలుగా వేధింపులకు గురవుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని ఇటువంటి వారికి భరోసా ఇచ్చి వారిని తిరిగి తమ స్వగ్రామాలకు తీసుకురావాడానికి ప్రత్యేక కార్యచరణ ప్రణాళికలు సిద్దం చేసామన్నారు. ఇందుకోసమే ప్రత్యేక యాప్ ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1.25లక్షల మంది పాస్ పోర్టు తీసుకొన్న వారు ఉన్నారని, 25 వేల మంది మహిళలు పలు దేశాల్లో ఉండగా, 16 వేల మంది మహిళలు గల్ఫ్ దేశాల్లో ఉన్నట్లు గుర్తించామన్నారు. ప్రధానంగా పలువురు ఏజెంట్లు ద్వారా అనేక మంది నిరుపేద మహిళలు గల్ఫ్ దేశాలకు వెల్లుతున్నారని, కొందరు ఏజెంట్ల మాటలకు మోసపోవడంతో విదేశాల్లో అనేక మంది మహిళలు దుర్భర జీవితాలను గడుపుతున్నారన్నారు. మహిళలు అక్కడ నుంచి రాలేక విధలేని పరిస్థితుల్లో అక్కడే వెట్టిచాకిరీ చేస్తు కాలం నెట్టు కొస్తున్నారని అటువంటి వారికి భరోసా ఇవ్వాలని నిర్ణయించామన్నారు. జిల్లాలో మహిళలను విదేశాలకు పంపే ఏజెంట్లు 400 మంది ఉన్నారని సమాచారం అందిందని, వీరి ద్వారా జిల్లాకు చెందిన మహిళలు ఏఏ దేశాలకు వెల్లారు వారు అక్కడ ఎలా ఉన్నారన్న సమాచారాన్ని ఈ ఏజెంట్ల ద్వారా సేకరించడం జరుగుతుందన్నారు. జిల్లా నుంచి వివిధ కారణాలు వల్ల విదేశాలకు వెల్లి అక్కడ ఇబ్బంది పడుతున్న వారిని గుర్తించి వారిని తిరిగి తమ స్వగ్రామాలకు రప్పించే విధంగా తగు చర్యలు తీసుకొంటున్నట్లు వివరించారు. విదేశాలకు వెల్లి అక్కడ ఇబ్బంది కరపరిస్థితులు ఎదుర్కొంటున్న వారి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా తమ పరిధిలోని పోలీసు స్టేషన్‌ను ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఈ విధంగా ఫిర్యాదు చేస్తే తదుపరి వారిని తిరిగి రప్పించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎవ్వరూ ఏజంట్ల మాయమాటలు నమ్మొద్దని ఎస్పీ సూచించారు.

పోలీసులచే రక్తదానం
పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురష్కరించుకొని మంగళవారం చిత్తూరులో పోలీసులు రక్తదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ రక్తదాన శిభిరాన్ని జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబు ప్రారంభించారు. ఈనెల 21వ తేదిన జరిగే పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టిన జిల్లా పోలీసు సిబ్బంది, మంగళవారం చిత్తూరు పోలీసు ఆసుపత్రిలో రక్తదానం చేశారు. ఏఎస్పీ సుప్రజ, డీఎస్పీలు గిరిధర్, కృష్ణమోహన్ , పలువురు సిఐలు ఇతర సిబ్బంది 80 మంది రక్తదానం చేశారు.