చిత్తూరు

చంద్రప్రభ వాహనంపై మలయప్ప స్వామి అభయ ప్రదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 16: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడవరోజైన మంగళవారం రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య శ్రీ మలయప్ప స్వామి చంద్రప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. వాహనం ముందు భాగాన వేద పండితులు వేద మంత్రోచ్ఛారణల నడుమ, భజన, కోలాట బృందాలు, వివిధ దేవతా మూర్తుల రూపాలతో కోలాహలంగా ముందుకు సాగుతుంటే స్వామి వారి వాహన సేవ అత్యంత వైభవంగా సాగింది. తెల్లటి పుష్పాలతో, వివిధ దివ్యాభరణాలతో అందంగా అలకరించిన స్వామిని చూసి భక్తులు చేసిన గోవిందనామ స్మరణలతో తిరుమల గిరులు మారుమోగాయి. తన కిరణాలతో ఔషధాలకు సైతం దివ్యశక్తులను ప్రసాదించే చంద్రుడిని తన వాహనంగా చేసుకున్న స్వామి తనను ఆశ్రయించిన వారికి సకల భోగ భాగ్యాలనే కాకుండా ముక్తిని కూడా ప్రసాదిస్తానంటూ వాహనసేవలో అభయ ప్రదానం చేశారు. వాహన సేవ ముందు భాగాన టీటీడీ పెద్దజీయర్, చిన్నజీయర్, ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, జేఈఓ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.

జనాభా నియంత్రణతోనే దేశాభివృద్ధి
* కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్
రామచంద్రాపురం, అక్టోబర్ 16: జనాభా నియంత్రణతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ సహాయమంత్రి గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. మంగళవారం మండల పరిధిలోని సీ.రామాపురంలోని బ్రహ్మర్షి గురూజీ ఆశ్రమంలో నిర్వహిస్తున్న దేవీ నవరాత్రి ఉత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దేశంలో రెండు కొత్త జిల్లాలకు సరిపడే జనాభా పెరుగుతోందన్నారు. దీనివల్ల అభివృద్ధిని సాధించలేకపోతున్నామని తెలిపారు. చైనా తరహాలో జనాభా నియంత్రణ చట్టం తీసుకురావాల్సి ఉందన్నారు. భారతదేశం హిందూ దేశమైనా ఇక్కడ అన్ని మతాలకు చోటు కల్పిస్తున్నామన్నారు. దేశ ప్రజలు సకల సంపదలతో తులతూగాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం అమ్మవారిని ప్రార్థించానన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి మహర్షి గురూజీ మంత్రపుష్పాలను అందించి, దుర్గమాతకు ప్రత్యేక పూజలు చేయించారు. ఆశీర్వచనాలు పలికి తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ ఉత్సవ నిర్వాహకులు ప్రకాష్ సేథియా, సుభాష్ జైన్, ప్రియా, ధనంజయ రెడ్డి, రాంప్రకాష్, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.