చిత్తూరు

రైతులకు ప్రయోజనం చేకూర్చే పథకాలు అమలు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెదురుకుప్పం, మే 8: గ్రామల్లోని వ్యవసాయ రైతు కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చే పథకాలను అమలు జరిపి రైతు కుటుంబాలను ఆదుకోవాలని కిసాన్‌సంఘ్ జిల్లా కార్యదర్శి చిన్నస్వామిరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని గంటావారి పల్లిలో జరిగిన కిసాన్ సంఘ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాగుబడి వ్యయం రెట్టింపు స్థాయిలో పెరగడం వల్ల రైతు కుటుంబాలు ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయన్నారు. సంక్షోభంలో ఉన్న రైతు కుటుంబాలను ఆదుకునేదిశలో ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ సంబంధ పరికరాలు పూర్తి స్థాయిలో ఉచితంగా అందజేయాలన్నారు. ఉపాధి పనుల వల్ల వ్యవసాయ రంగానికి కూలీల బెడద తీవ్రంగా ఉందని, వ్యవసాయ సాగుబడి విస్తీర్ణం పెరగాలంటే ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలన్నారు. ఉపాధి నిధులను వ్యవసాయ రంగానికి కేటాయించడం వల్ల వ్యవసాయ ఉత్పత్తులు ఘణనీయంగా పెరగడమే కాకుండా రైతాంగం ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉందన్నారు. వరిధాన్యం కొనుగోలు చేసిన తరహాలోనే ప్రతి మండల కేంద్రంలో నల్లబెల్లం కొనుగోలును సింగిల్‌విండో కార్యాలయాల ద్వారా కొనుగోలుచేయాలన్నారు. నల్లబెల్లంకు గిట్టుబాటు ధరలు కల్పించాలని వ్యవసాయ సంబంద రుణాల పరిమితి పెంచాలన్నారు. రైతు కుటుంబానికి బ్యాంకర్లు 25 వేల రూపాయలు మాత్రమే వ్యవసాయ సంబంధ రుణాలుగా మంజూరుచేయడం జరుగుతుందని, ఈ పరిమితిని లక్ష రూపాయల వరకు పెంచాలన్నారు. మార్కెట్‌లో ఎకరా వ్యవసాయ భూమి ధర రూ.15 లక్షల నుంచి 30 లక్షల వరకు విలువ ఉన్నదన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని బ్యాంకర్లు రూ.3 లక్షల వరకు వడ్డీలేని రుణాన్ని రైతాంగానికి కేటాయించాలన్నారు. పాడి ఆవుల మంజూరుకు మరియు వ్యవసాయ సంబంధ రుణాల మంజూరుకు గ్యారంటీర్లతో ప్రమేయం లేకుండా రైతులకు రుణ సదుపాయం కలుగజేయాలన్నారు. సేంద్రియ విధానం ద్వారా రైతులు పండించిన పంటలకు ప్రభుత్వం ప్రత్యేకంగా గిట్టుబాటు ధరలు కల్పించి ఆదుకోవాలన్నారు. ఎకరాభూమి ఉన్న రైతుకు సైతం వర్మీకంపోస్టు యూనిట్‌ను ఉచితంగా ఏర్పాటుచేయాలన్నారు. రైతులు ప్రభుత్వానికి వరి ధాన్యం అమ్ముతున్నారని, ఆ మొత్తాలను ప్రభుత్వం జాప్యంలేకుండా రైతుల వ్యిక్తిగత ఖాతాలకు త్వరిత గతిన మంజూరుచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘ నేతలు పెద్దబ్బరెడ్డి, విష్ణువర్థన్, బాలాజి, రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.