చిత్తూరు

కపిలేశ్వరాలయంలో శాస్త్రోక్తంగా నవగ్రహ హోమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 14: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయంలో నెల రోజులు పాటు జరుగుతున్న హోమ మహోత్సవాల్లో భాగంగా బుధవారం నవగ్రహ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 9 నుండి 12గంటల వరకు నవగ్రహహోమం, పూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహాశాంతి అభిషేకం, నవగ్రహ కలశాభిషేకం నిర్వహించారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8గంటల వరకు శ్రీ దక్షిణామూర్తి స్వామి వారి కలశస్థాపన, విశేష దీపారాధన నిర్వహించారు. కాగా నవంబర్ గురువారం శ్రీ దక్షిణామూర్తి హోమం నిర్వహిస్తారు. గృహస్థులు రూ.500 చెల్లించి ఒక్క రోజు హోమంలో పాల్గొనవచ్చును. గృహస్థులకు ఒక ఉత్తరీయం, రవికె, అన్నప్రసాదం అందజేస్తారు. ఈ కార్యక్రమంల ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ రాజ్‌కుమార్, ఆలయ అర్చకులు స్వామినాథస్వామి, మణిస్వామి, ఉదయ స్వామి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు మురళీకృష్ణ, రెడ్డిశేఖర్, ఇతర అధికారులు, విశేషసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

మారథాన్ పరుగుపందెంలో నవ్యతేజకు మొదటిస్థానం
మదనపల్లె, నవంబర్ 14: యూత్ కరాటే క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన మారథాన్ వందమీటర్ల పరుగుపందెంలో నవ్యతేజ్ మొదటిస్థానంలో నిలచినట్లు గ్రాండ్‌మాస్టర్ కరాటే సురేష్ తెలిపారు. విజయభారతి పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న డేగాని నవ్యతేజ్ 100మీటర్ల పరుగుపందెంలో మొదటిస్థానంలో నిలిచాడు. బుధవారం స్థానిక కోటవీధిలోని హోప్ మున్సిపల్ హైస్కూల్‌లో యూత్ కరాటే క్లబ్ నిర్వహించిన చిల్డ్రన్స్‌డేలో ముఖ్యఅతిధిగా హాజరైన ట్రాఫిక్ సీఐ శ్రీనివాసులు చేతుల మీదుగా ప్రసంశాపత్రం, జ్ఞాపికను అందజేశారు.