చిత్తూరు

16 నుండి శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 14: టీటీడీ ఆధ్వర్యంలో నవంబర్ 16 నుండి 18వ తేదీ వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం నిర్వహించనున్నట్లు దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనందతీర్థాచార్య బుధవారం ఒక ప్రటకనలో తెలిపారు. మెట్లోత్సవ సంబరాలు తిరుపతిలోని రైల్వేస్టేషన్ వెనుక గల టీటీడీ మూడవ సత్ర ప్రాంగణంలో జరగనున్నాయి. ఈ మూడు రోజులు పాటు ఉదయం 5 నుండి 7గంటల వరకు భజన మండళ్లతో సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన కార్యక్రామలు నిర్వహిస్తారు. ఉదయం 8.30గంటల నుండి 12గంటల వరకు ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల భజన మండళ్లతో సంకీర్తనలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 నుండి 6గంటల వరకు ధార్మిక సందేశాలు, హరిదాసులు మానవాళికి అందించిన ఉపదేశాలు తెలియజేస్తారు. సాయంత్రం 6 నుండి 8గంటల వరకు సంగీత విభావరి, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. నవంబర్ 16న శుక్రవారం సాయంత్రం 4గంటలకు శ్రీగోవిందరాజస్వామి ఆలయం నుండి మూడవ సత్రం ప్రాంగణం వరకు శోభాయాత్ర నిర్వహిస్తారు. సాయంత్రం 6 నుండి 8గంటల వరకు అధికార ప్రముఖులు సందేశం ఇవ్వనున్నారు. నవంబర్ 17వ తేదీ శనివారం ఉదయం 4.30గంటలకు అలిపిరి పాదాల మండపం వద్ద మెట్లపూజ నిర్వహిస్తారు. అనంతరం వేల సంఖ్యలో వచ్చే భజన మండలి సభ్యులతో సంప్రదాయ భజనలు చేస్తూ సప్తగిరీశుని చేరుకుంటారు. గతంలో ఎందరో మహర్షులు, రాజర్షులు పురంధరదాసులు, వ్యాసరాజయతీశ్వరులు, అన్నమాచార్యులు, శ్రీకృష్ణదేవరాయలు వంటి మహనీయులు భక్తిప్రపత్తులతో వేంకటాద్రి పర్వతాన్ని కాలినడకన అధరోహించి మరింత పవిత్రమయం చేశారు. అలాంటి వారి అడుగుజాడల్లో నడిచి ఆ దేవదేవుని కృపక అందరూ పాత్రులు కావాలనే తలంపుతో మెట్లోత్సవ కార్యక్రమాన్ని దాససాహిత్య ప్రాజెక్టు చేపట్టింది. ఇలా సప్తగిరులను అధిరోహించి సప్తగిరీశుని దర్శిస్తే, వారికి సకల అరిష్టములు తొలగి సర్వాభీష్టాలు సిద్దిస్తాయి.