చిత్తూరు

జాతీయ క్రీడాపోటీలకు జిల్లా వేదిక కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, నవంబర్ 14: జాతీయ క్రీడాపోటీలకు జిల్లా వేదిక కావాలని కలెక్టర్ ప్రద్యుమ్న ఆకాంక్షించారు. బుధవారం చిత్తూరు నగరంలోని డీఎస్‌ఏ స్టేడియంలో రూ. 41లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సింతటిక్ బాస్కెట్‌బాల్ కోర్టును కలెక్టర్, ఎస్పీ, ఇతర ప్రజాప్రతినిధులు కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చిత్తూరు నగరాన్ని స్పోర్ట్స్ సిటీగా తయారు చేయాలనేది తన ఆకాంక్షని అన్నారు. అందులో భాగంగా నగరంలో పలు క్రీడలకు సంబంధించిన వసతులు కల్పిస్తున్నామన్నారు. జిల్లాలో క్రీడాకారులకు కొదవ లేదని, జిల్లా జాతీయ స్థాయి క్రీడాపోటీలకు వేదిక కావాల్సిన అవసరం ఉందన్నారు. నగరంలో బాస్కెట్‌బాల్‌కు మంచి అదరణ ఉందని, అందుకని రూ.41 లక్షల వ్యయంతో సింతటిక్ కోర్ట్ ఏర్పాటు చేసామన్నారు. ఈ కోర్టులో జాతీయ బాస్కెట్‌బాల్ పోటీలు జరగాలని కోరుకొంటున్నట్లు తెలిపారు. దీనిని ఇండోర్ స్టేడియం చేయడానికి కూడా చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చే నెల తిరుపతిలో జాతీయ అథ్లెటిక్ పోటీలు జరుగనున్నాయని చెప్పారు. రాష్ట్రప్రభుత్వం క్రీడలకు ఏంతో ప్రాధాన్యత ఇస్తోందని, ప్రాజెక్టు గాంఢీవతో క్రీడాకారులను ప్రోత్సహిస్తోందని చెప్పారు. ఇప్పటికే నగరంలో పలు మైదానాలు ఏర్పాటు చేసామని, సంతపేటలో మినీ స్టేడియం నిర్మాణం టెండర్ల దశలో ఉందన్నారు. జిల్లాలో పలు క్రీడాల్లో అనేకమంది మంచి ప్రతిభ చూపుతున్నారని, వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ నగరంలో దశలవారీగా పలు క్రీడలకు సంబంధించిన వసతులు ఏర్పాటు అవుతుండటం గొప్ప విషయమన్నారు. నేడు సింతటిక్ కోర్ట్ నిర్మించడం సంతోషదాయకమన్నారు. అనంతరం అధికారులు ప్రజాప్రతినిధులు పూజా కార్యక్రమాన్ని నిర్వహించి సరదాగా కొంతసేపు బాస్కెట్‌బాల్ ఆడారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్ , జడ్పీ చైర్‌పర్స్‌న్ గీర్వాణీ చంద్రప్రకాష్, ఎమ్మెల్సీ దొరబాబు, మేయర్ కఠారి హేమలత, డిప్యూటీ మేయర్ సుగ్రీ, సెట్విన్ సీఈవో లక్ష్మి, అధికారులు గోపీచంద్, ఓబులేష్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు నాని, బాస్కెట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు చెంగల్రాయనాయుడు, ఉపాధ్యక్షుడు జైప్రకాష్, కార్యదర్శి సురేష్‌బాబు, క్రీడాకారులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు.
అలిగి వెళ్లిన చిత్తూరు ఎంపీ
చిత్తూరు నగరంలో బుధవారం నూతనంగా నిర్మించిన బాస్కెట్‌బాల్ సింతటిక్ కోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ఆలిగి వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమాన్ని ఉదయం 9గంటలకు ప్రారంభించాల్సి ఉండగా కలెక్టర్, ఎస్పీలు కొంత ఆలస్యంగా వచ్చారు. అప్పటికే హాజరైన ఎంపీ అధికారులకోసం వేచి ఉన్నారు. ఎస్పీ వచ్చిన తరువాత ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని అంతవరకు వేచి ఉండాలని కలెక్టర్ చెప్పడంతో ఎంపీ అలిగి వెళ్లిపోయారు. ఎస్పీగా బాధ్యతలు తీసుకుని ఇప్పటి వరకు తనను కలవలేదని, కనీసం ఫోన్ కూడా చేయలేదంటూ ఇది సరైన పద్ధతి కాదంటూ ఎంపీ ఆవేశంతో కారు ఎక్కి వెళ్లే ప్రయత్నం చేసారు, ఎమ్మెల్సీ దొరబాబు, జిల్లా టీడీపీ అధ్యక్షుడు నాని మరికొందరు ఆయనను సముదాయించే ప్రయత్నం చేసినా ఆయన పట్టించుకోకుండా కారులో వెళ్లిపోయారు.

రాష్ట్ర స్థాయి హైజంప్‌లో కార్వేటినగరం విద్యార్థి ప్రతిభ
వెదురుకుప్పం, నవంబర్ 14: కార్వేటినగరంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఇఫ్రోజ్ రాష్టస్థ్రాయిలో జరిగిన హైజంప్ పోటీలో ప్రతిభ కనిపరిచిన విద్యార్థికి ప్రధానోపాధ్యాయురాలు వసుమతి దేవి సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గుంటూరు జిల్లా వినుకొండ లో జరిగిన రాష్ట్ర స్థాయి హైజంప్ పోటీలో ప్రతిభ కనబరచినందుకు అభినందనీయమన్నారు. అనంతరం సత్కరించారు. ఈ కార్యక్రమంలో పీడీ సురేష్‌బాబు, దినకర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.