చిత్తూరు

శ్రీవారి కైంకర్యాలకు శ్రీగంధం మొక్కల పెంపకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 14: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి నిత్య కైంకర్యాలకు వినియోగించే శ్రీగంధం మొక్కలను రికార్డు స్థాయిలో 100హెక్టార్లలో పెంచుతున్నామని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమలలోని పార్వేటమండపం సమీపంలో ఉన్న శ్రీగంధం వనాన్ని బుధవారం ఉదయం ఆయన తిరుమల జేఈవో శ్రీనివాసరాజుతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ 2013వ సంవత్సరం భారత ప్రభుత్వం రూ.76లక్షలు, టీటీడీ రూ.50లక్షలతో 45హెక్టార్లలో శ్రీగంధం వన పెంపకాన్ని ప్రారంభించిందన్నారు. ప్రస్తుతం టీటీడీ అటవీ విభాగం ఆధ్వర్యంలో 100హెక్టార్లలో శ్రీగంధం వనాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. హెక్టార్‌కు వెయ్యి మొక్కలు పెంచుతున్నామని ఇందులో 500 శ్రీగంధం మొక్కలు, 500 ఎర్రచందనం మొక్కలు, రోజ్‌వుడ్ వంటి ఇతర మొక్కలు పెంచుతున్నామన్నారు. తిరుమలలో పెంచుతున్న శ్రీగంధం మొక్కలు దేశంలో ఎక్కడా లేని విధంగా మొక్కలు బాగా పెరుగుతున్నాయని, శ్రీగంధం వనం నిర్వహణకు టీటీడీ ప్రతి ఏడాది 10లక్షల రూపాయలు నిధులు అందిస్తోందన్నారు. ప్రస్తుతం పెంచుతున్న శ్రీగంధం మొక్కలు దాదాపు 300 సంవత్సరాలు పాటు శ్రీవారి కైంకర్యాలకు సరిపోతాయన్నారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు తిరుమలకు విచ్చేసే లక్షలాది భక్తులకు మరింత ఆధ్యాత్మిక, ఆహ్లాదకర వాతావరణం ఏర్పాటు చేసేందుకు పూలమొక్కలు పెంచుతున్నామన్నారు. టీటీడీ అటవీ విభాగం, గార్డెన్ విభాగం ఇప్పటీకే రెండు ఘాట్‌రోడ్లు, అలిపిరి మెట్లమార్గంలో 10వేల మొక్కలు, శ్రీవారి మెట్టు మార్గంలో 3500వివిధ రకాల ఆకర్షణీయమైన పూలమొక్కలు పెంపకం చేపట్టామన్నారు. ఇందుకోసం 3.6కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. అంతకముందు ఈవో అధికారులతో కలసి వైకుంఠం క్యూకాంప్లెక్స్1, సుపథం, శిలాతోరణం వద్ద ఉన్న ఉద్యానవనాలను పరిశీలించారు. అనంతరం జీఎన్‌సీ టోల్‌గేట్ వద్ద ఉన్న దివ్యారామం మొక్కల పెంపక కేంద్రాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఎస్‌ఈ రామచంద్రారెడ్డి, ఎస్‌ఈ ఎలక్ట్రికల్ వెంకటేశ్వర్లు, డిఎఫ్‌ఓ పణికుమార్‌నాయుడు, వీజీవో మనోహర్, ఇతర అధికారులు ఉన్నారు.
వేడుకగా స్నపన తిరుమంజనం

తిరుపతి, నవంబర్ 14: పవిత్రమైన కార్తీకమాసంలో శ్రవణానక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సువాసనలు వెదజల్లే 14 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారికి వేడుకగా పుష్పార్చన నిర్వహించారు. పుష్పయాగం సందర్భంగా ఉదయం 9 నుండి 11గంటల వరకు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపుతో అభిషేకం చేసి చివరగా చందనలేపనాన్ని అలంకించారు. ఆ తరువాత తులసీమాలలను ధరింపజేసి నక్షత్రహారతి నివేదించారు. ఈ సందర్భంగా వేదపండితులు పంచసూక్తాలు, ఉపనిషత్తుల్లోని మంత్రాలను పఠించారు. శ్రీవారి పుష్పయాగాన్ని ఘనంగా నిర్వహించేందుకు దాతల నుండి పుష్పాలను సేకరించేందుకు కృషి చేసిన టీటీడీ ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులును టీటీడీ ఈవో, జేఈవోలు శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సీవిఎస్‌వో గోపీనాథ్‌జెట్టి, అదనపు సీవిఎస్‌ఓ శివకుమార్‌రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఇతర అధికారులు, విశేషసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
నెహ్రూ ఆలోచనతోనే తిరుపతిలోఎస్వీయూ ఏర్పాటు
* శ్రీశైలం ప్రాజెక్ట్ కర్త, కర్మ, క్రియ నెహ్రూనే
* నిజాయితీ పరులను సీఎం లను చేసిన ఘనత నెహ్రూది * మాజీ కేంద్రమంత్రి డాక్టర్ చింతామోహన్

తిరుపతి, నవంబర్ 14: జవహర్‌లాల్ నెహ్రూ ఒక గొప్ప పోరాట యోధుడని, ప్రజాసేవకుడు అని, మహామేధావి అని భారతదేశంలో ఆయన పాలనలో చేపట్టిన ప్రజాసంక్షేమ కార్యక్రమాలే అద్దం పడతాయని, తిరుపతిలో ఎస్వీ యూనివర్సిటీ ఏర్పాటైన సాగునీరు-తాగునీరు కోసం శ్రీశైలం లాంటి ప్రాజెక్ట్ నిర్మాణానికైనా కర్త, కర్మ,క్రియ నెహ్రూనే అన్నారు. సంస్కరణలకు సంబంధించైనా, దేశ రచనలకు సంబంధించైనా ఆయన ఎన్నో గొప్ప చర్యలు చేపట్టానన్నారు. నిజాయితీపరులైన ప్రకాశం పంతులు లాంటి వారిని ఎంతోమందిని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అందించిన ఘనత నెహ్రూదే అన్నారు. జవహర్‌లాల్ నెహ్రూ 129వ జయంతిని పురస్కరించుకొని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం విద్యార్థుల ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియంలో నెహ్రూపై సెమినార్ నిర్వహించారు. ఈసందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన చింతామోహన్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు అమలుకాకపోయినా నాడు నెహ్రూ తీసుకొచ్చిన పంచవర్ష ప్రణాళిక ప్రపంచంలోని 200 దేశాల్లో ఎక్కడాలేదన్నారు. చైనా, రష్యాలాంటి దేశాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయన్నారు. అమెరికాలో అంతంత మాత్రంగానే దేశ పాలనకు సంబంధించి ఇలాంటి ప్రణాళిక విధానాలు అమలవుతున్నాయన్నారు. 1993 మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్రరాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడుతున్న సమయంలో తిరుపతిని రాజధానిని చేయాలని గరిమెళ్ల నాగిరెడ్డి, ఎన్‌జీ రంగా లాంటి నాయకులు పట్టుబట్టారన్నారు. అయితే నీలం సంజీవరెడ్డి తన సొంత తెలివితేటలతో 1955లో ఆంధ్రరాష్ట్ర రాజధానిని కర్నూలుకు తీసుకెళ్లాడన్నారు. ఆ సమయంలో గరిమెళ్ల నాగిరెడ్డి, ఎన్‌జీ రంగా ఈ చర్యలపై తీవ్రంగా విభేదించారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తొలి ప్రధాని అయిన నెహ్రూ జోక్యం చేసుకొని కర్నూలుకు రాజధానిని ఇచ్చి ఒక గొప్ప విశ్వవిద్యాలయాన్ని తిరుపతికి ఇస్తానని హామీ ఇచ్చి అమలుచేశారన్నారు. నెహ్రూ లేకపోతే ఎస్వీ యూనివర్సిటీ లేదన్నారు. క్రైంబ్రిడ్జ్, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలతో సరితూగే విశ్వవిద్యాలయం తిరుపతిలో ఏర్పాటుచేయాలని నాడు నెహ్రూ ఆకాంక్షించాడన్నారు. ఇక సాగునీరు-తాగునీరుకు తీవ్ర కొరత ఏర్పడినపుడు నాగార్జున ప్రాజెక్ట్‌ను ఏపీకి అందించింది కూడా నెహ్రూనే అన్నారు. ఇక విద్యుత్ కొరత లేకుండా శ్రీశైలం ప్రాజెక్టుకు ప్రణాళికలు రూపొందించింది నెహ్రూనే అన్నారు. ఇక నిజాయితీ పరులైన వారిని రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసింది కూడా నెహ్రూనే అన్నారు. అందులో ప్రకాశం పంతులు, దామోదరం సంజీవయ్య లాంటి వారు ఎంతో మంది ఉన్నారన్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదరం సంజీవనాయుడు వంటి మహనీయులకు తనసొంత ఊరైన కర్నూలులో ఇల్లుకూడా లేని పరిస్థితి అన్నారు. నేడు ఐజర్, ఐఐటీ లాంటి జాతీయ విద్యాసంస్థలు అందుబాటులోకి వచ్చినా నాటి నెహ్రూ ఆలోచనలేనని, ఇది అక్షరసత్యం అన్నారు. ఇక భారత దేశానికి 5 సంవత్సరాల్లో ఒక్కొక్క సంవత్సరం ఎలాంటి ప్రణాళికలు అమలు చేయాలనే అంశాన్ని పరిగణనలోకి తీసుకొని నెహ్రూ పంచవర్ష ప్రణాళికను రూపొందించారన్నారు. 200 దేశాల్లో ఇలాంటి విధానాలు ఎక్కడాలేవన్నారు. ఇక రక్షణ శాఖకు సంబంధించి నెహ్రూ దేశానికి ఎంతోగొప్ప వ్యవస్థను రూపొందించారన్నారు. అయితే నేడు అవసరం లేకపోయినా మోదీ ప్రభుత్వం యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తోందని పరోక్షంగా ట్రాఫిక్ కుంభకోణంపై ఆయన చురకలు అంటించారు. ఇలాంటి మహనీయుడి జయంతి సందర్భంగా ఒక్క పత్రికలో కూడా ఒక్క వ్యాసం లేకపోవడానికి తాను గమనించి ఆవేదనకు లోనయ్యానన్నారు. ఏఐసీసీ సభ్యురాలు ప్రమీలమ్మ మాట్లాడుతూ నెహ్రూ గొప్ప సంపన్నుడైనా సుఖభోగాలను అందుకోకుండా 22 సంవత్సరాలలోనే దేశానికి తాను ఏమి చేయాలని యోచించిన గొప్ప దేశభక్తి పరాయణుడన్నారు. 22 సంవత్సరాల అతిపిన్న వయస్సులోనే స్వాతంత్య్ర పోరాటంలో నెహ్రూ భాగస్వామ్యం అయ్యాడన్నారు. బ్రిటీష్ పాలకుల విధానాలకు నిరసనగా 1920లో సహాయ నిరాకరణ ఉద్యమంలో నెహ్రూ పాల్గొన్నారన్నారు. 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష కూడా అనుభవించారన్నారు. ఇక ఉద్యమంలో భాగంగా బ్రిటీష్ పాలకులను వ్యితిరేకించేవారిని ఒక తాటిపైకి తీసుకువచ్చి భారతదేశానికి స్వాతంత్య్రం ఇవ్వాలనే నినాదాన్ని తెరపైకి తీసుకువచ్చారని ఆమె పలు సంఘటనలను వివరించారు. ఎస్వీ ఆర్ట్స్ కళాశాల అధ్యాపకులు డాక్టర్ పుచ్చలపల్లి నాగరాజు మాట్లాడుతూ నెహ్రూ తొలి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి 16 సంవత్సరాల 6 నెలలు ఆ పదవిలో కొనసాగారన్నారు. జవహర్‌లాల్ నెహ్రూపేరులో ఒక గొప్ప పరమార్థం ఉందన్నారు. ‘నెహర్’ అంటే కాలువగట్టుపై జీవించే వారు అని అర్థం అన్నారు. ఇక చాచా కాష్మీర్ పండింట్ కావడంతో జవహర్‌లాల్ నెహ్రూ అని పేరుపెట్టుకున్నారన్నారు. ఎస్వీ యూనివర్సిటీతో నెహ్రూకు విడదీయలేని బంధం ఉందన్నారు. ఇంజనీరింగ్ భవనాలను ఆయన ప్రారంభించారన్నారు. ఆయన పీజీలో 2వ క్లాస్‌లో అది కూడా చివరి మార్కులతో పాసయ్యారన్నారు. నెహ్రూకు గుర్రం స్వారీ, పడవ పందేలు, టెన్నీస్ లాంటి ఆటల పోటీల్లో ఆసక్తి ఎక్కువన్నారు. అందుకే ఆయన చదువులో గొప్పగా రాణించకపోయినా నాయకుడిగా ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగారన్నారు. ఇక తిరుపతికి, తిరుమలకు నీరు అందిస్తున్న కల్యాణి డ్యాం నిర్మాణానికి ఎస్వీయూలో పునాది వేసింది ఇందిరాగాంధీ అన్నారు. ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణపై నెహ్రూ కుటుంబంలోనే జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల విశ్రాంత ఆచార్యులు సౌందరరాజన్, కాంగ్రెస్ నాయకులు పూతలపట్టు ప్రభాకర్, విద్యార్థి నాయకులు, రీసెర్చ్ విద్యార్థులు పాల్గొన్నారు.