చిత్తూరు

కార్మిక, సామాజిక పోరాటాలు కలిసి నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 17: దేశంలో కార్మిక సంఘాలు కార్మికుల సమస్యలపైన అలాగే సామాజిక సమస్యలపైనా జమిలీగా పోరాటాలు నిర్వహించినప్పుడే అత్యంత పేదలు, బలహీన వర్గాలకు ఉపశమనం లభిస్తుందని దళిత్ శోషన్ ముక్తిమంచ్ జాతీయ కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. శనివారం స్థానిక మధురానగర్‌లోని సీఐటీయూ కార్యాలయంలో జిల్లా నేతల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన వారినుద్దేశించి మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం సంస్కరణల పేరుతో సాగిస్తున్న ఆర్థిక విధానాలు దేశంలోని ప్రజలను దరిద్ర నారాయణులుగా మారుస్తోందని మండిపడ్డారు. సంపద పెంచుకుంటున్నవారు కొందరైతే దోపిడీకి గురవుతున్న ప్రజలు, కార్మికులు కోట్లాది మందిగా ఉన్నారని అన్నారు. పచ్చికాపలం మహాభారతంలో వివక్ష సమస్య నేటికీ పరిష్కారం కాలేదని ఏదో ఒక రూపంలో వివక్ష సాగుతూనే ఉందన్నారు. అధికార యంత్రాంగం దీనిపై ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. గ్రామాలలో కుటుంబం యావత్తు కష్టపడితే తప్ప పూట గడవని పరిస్థితి నెలకొని ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 24,25 తేదీలలో తిరుపతిలో జరిగే దళిత హక్కుల జాతీయ సదస్సును కార్మికవర్గం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.అజయ్‌కుమార్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.నాగార్జున, కందారపు మురళీ, నాయకులు పుల్లయ్య, జి.బాలసుబ్రమణ్యం, ప్రసాదరావు, చంద్రశేఖర్ రెడ్డి, సుబ్రమణ్యం, వెంకటేష్, నాగరాణి, నారాయణ బాబు తదితరులు పాల్గొన్నారు.

ఆధునిక విజ్ఞానాన్ని నర్సింగ్ విద్యార్థినులు అంది పుచ్చుకోవాలి
* స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్
తిరుపతి, నవంబర్ 17: మారుతున్న కాలానుగుణంగా ఆధునిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకుని నర్సింగ్ విద్యార్థినులు రోగులకు మెరుగైన, తక్కువ ఖర్చుతో అత్యుత్తమ వైద్య సేవలను అందించాలని స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ టిఎస్ రవికుమార్ చెప్పారు. శనివారం కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఆధ్వర్యంలో ఎస్వీమెడికల్ కళాశాల ఆడిటోరియంలో ఆన్ అప్‌డేట్ రీసెంట్ అడ్వానె్సస్ ఇన్ పీడియాట్రిక్ నర్సింగ్ అనే అంశంపై జాతీయ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ ఈ సదస్సుకు ఉత్తరాఖండ్, బీహార్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరవడం హర్షణీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే ఎన్‌టిఆర్ వైద్యసేవ పథకం, కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తున్న ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలను విజయవంతంగా అమలు చేయడానికి డాక్టర్ల కృషితోపాటు నాణ్యమైన నర్సింగ్ సేవలు అవసరమన్నారు. రిజిస్ట్రార్ డాక్టర్ కళావత్ మాట్లాడుతూ నేటి ఆధునిక పీడియాట్రిక్ నర్సింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఫ్యాకల్టీ, నర్సింగ్ విద్యార్థులు నూతన మార్పులను, ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని రోగులకు అత్యున్నత స్థాయిలో వైద్య సేవలను అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల నుంచి హాజరైన డాక్టర్ ఎ.పద్మజ, ఎస్.మలర్‌కోడి, ఎస్‌కే మోహన సుందరి, ఆచార్య పి.హేమలత, ఎం.రమ్య, యు.దందార్గీలు అడ్వానె్సస్ ఇన్ పీడియాట్రిక్ నర్సింగ్ అనే అంశంపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. ఈకార్యక్రమంలో ఆర్గనైజింగ్ కార్యదర్శి డాక్టర్ పద్మజ, నర్సింగ్ ప్రిన్సిపాల్ డాక్టర్ సుధారాణి, డిప్యూటి రిజిస్ట్రార్ డాక్టర్ ఎర్రమ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.