చిత్తూరు

యూనిట్ల పంపిణీకి బ్యాంకర్లు సిద్ధంగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, నవంబర్ 17: ప్రభుత్వ ఆదేశాల మేరకు వివిధ పథకాల కింద మంజూరైన యూనిట్ల పంపిణీకి బ్యాంకర్లు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ప్రద్యుమ్న ఆదేశించార. ఈ కార్యక్రమం చిరస్థాయిగా నిలిచేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. శనివారం కలెక్టర్ తన కార్యాలయంలో బ్యాంకర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డిసెంబర్ ఐదవ తేదీన నిర్వహించే మెగా గ్రౌండింగ్ మేళాలో రికార్డు స్థాయిలో యూనిట్లను పంపిణీ చేయాలని నిర్ణయించామని, ఈ విషయంలో బ్యాంకర్లు చొరవ చూపాలన్నారు. ఇప్పటి వరకు చేపట్టిన యూనిట్ల పంపిణిలో బ్యాంకర్లు పూర్తి సహాయ, సహకారాలు అందించి ఉంటే ఎంతోమంది లబ్ధి పొందేవారని, కొన్ని బ్యాంకులు వ్యవహరిం తీరు కారణంగా అటు లబ్ధిదారులకు, ఇటు తనకూ సంతృప్తి లేకుండా పోయిందన్నారు. వారానికి రెండుసార్లు బ్యాంకర్లతో పథకాల అమలుపై సమీక్షిస్తున్నా ఆశించిన స్థాయిలో మార్పు రాలేదని వాపోయారు. ఇకనైనా బ్యాంకర్లు తమ ఆలోచనా ధోరణిని మార్చుకుని ఎకనమిక్ సపోర్ట్ స్కీంలకు సంబంధించి నిర్ధేశించిన లక్ష్యాలను పూర్తిచేసి ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చాలన్నారు. కొన్ని బ్యాంకుల తీరును నిరసిస్తూ లబ్ధిదారులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన సంఘటనలు తన దృష్టికి వచ్చిందన్నారు. లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేసే బ్యాంకులలోని ప్రభుత్వ డిపాజిట్లు, స్వయం సహాయక సంఘాల బ్యాంకు ఖాతాలను వెంటనే ఉపసంహరించుకుంటామని హెచ్చరించారు. పాతపద్ధతులకు స్వస్తి చెప్పి ఏ ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేసిన యూనిట్లను అదే సంవత్సరంలో గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు చేపట్టి కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నామని, ఇందుకు బ్యాంకర్లు సహకరించాలని కోరారు. ఈనెల 25వ తేదీన మరోసారి బ్యాంకు ప్రతినిధులతో సమీక్షిస్తామని, ఈలోగా ఆయా బ్యాంకులు తమ లక్ష్యాలను పూర్తిచేసుకుని రావాలన్నారు. ఈ సమావేశంలో జెసీ-2 చంద్రవౌళి, లీడ్ మెనేజర్ గణపతి, జడ్పీ సీఈవో రవికుమార్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీటీ కార్పొరేషన్ల ఈడీలు కనకనరసారెడ్డి, అబ్షాలోము, మురళీధరమూర్తి, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

20,27వ తేదీల్లో వృద్ధులు, దివ్యాంగులకు 21,28వ తేదీల్లో చంటిపిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి పత్యేక ప్రవేశ దర్శనం
తిరుపతి, నవంబర్ 17: కలియుగ ప్రత్యక్షదైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం ఎక్కువ మంది వయోవృద్ధులు, దివ్యాంగులకు, 5 సంవత్సరాలలోపు చంటిపిల్లలకు, వారి తల్లిదండ్రులకు కల్పించాలన్న ఉన్నతాశయంతో టీటీడీ ప్రతినెలా రెండు సామాన్య దినాలలో వీరికి ప్రత్యేక దర్శనాలను కల్పిస్తోంది. ఇందులో భాగంగా 20,27వ తేదీల్లో వయోవృద్ధులు(65సం పైబడినవారు), దివ్యాంగులకు 4వేల టోకెన్లు టీటీడీ జారీ చేయనుంది. ఉదయం 10 గంటల స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 2గంటలకు 2వేల టోకెన్లు, 3గంటల స్లాట్‌కు వెయ్యిటోకెన్లు జారీ చేస్తారు. వృద్ధులు, దివ్యాంగులకు ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా స్వామివారి దర్శనం కల్పిస్తున్న విషయం విధితమే. భక్తుల కోరిక మేరకు మరింత మందికి స్వామివారి దర్శనం కల్పించేందుకు నెలలో రెండురోజులపాటు టీటీడీ అదనంగా దర్శన టిక్కెట్లు జారీ చేస్తోంది. వృద్ధులు, దివ్యాంగులు రద్దీరోజుల్లో తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకుండా, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ కోరుతుంది. అదేవిధంగా 5 సంవత్సరాలలోపు చంటిపిల్లలకు, వారి తల్లిదండ్రులకు ఈనెల 21,28వ తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు సుపథం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. సాధారణ రోజుల్లో ఒక సంవత్సరంలోపు చంటిపిల్లలకు, వారి తల్లిదండ్రులకు సుపథం మార్గం ద్వారా ప్రవేశం కల్పిస్తారు. భక్తుల కోరిక మేరకు ఐదేళ్లలోపు చంటిపిల్లలను, వారి తల్లిదండ్రులను ఈరెండు రోజుల్లో సుపథం మార్గం ద్వారా అనుమతిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ కోరుతుంది.