చిత్తూరు

మూడవ విడత జన్మభూమి - మా ఊరును

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 26 : ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని 2016 జనవరి 2 నుంచి 11 వ తారీఖు వరకు నిర్వహించనున్న జన్మభూమి - మా ఊరు కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయడానికి అధికారులు దృష్టి సారించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులను ఆదేశించారు. తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయంలా జిల్లా అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలకు ఎన్‌టిఆర్ భరోసా పథకం ద్వారా 13 జిల్లాలోని ప్రజలకు లబ్ధి చేకూరే ప్రణాళికను చేపడతున్నామన్నారు. ఇందులో భాగంగా 4373325 మంది లబ్ధిదారులకు నెలకు 470.48 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. జన్మభూమి కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అనుబంధ అధికారులు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు జిల్లా స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు, మంత్రులు జన్మభూమి కమిటి మెంబర్లు ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని సూచించారు. 7 మిషన్లు 5 కార్యక్రమాలు, 5 గ్రిడ్లతో ఈ జన్మభూమి - మా ఊరు స్పూర్తిగా సాగాలన్నారు. గత రెండు జన్మభూమి - మా ఊరు ప్రజలనుంచి వినతులలో 80 శాతం పరిష్కరించడం జరిగిందన్నారు. 12 లక్షల నూతన రేషన్ కార్డులు అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ వియన్ చంద్, సబ్ కలెక్టర్ హిమాంశీ శుక్లా, తహశీల్దారులు, ఎంపిడివోలు, ఈవో పి ఆర్ డిలు పాల్గొన్నారు.