చిత్తూరు

నేడు భగవద్ రామానుజాచార్యుల సహస్రాబ్ది సంచార రథయాత్ర ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 9 శ్రీ భగవద్ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు మంగళవారం ఉదయం 10.30గంటలకు స్థానిక మహతి ఆడిటోరియంలో ప్రారంభం కానుంది. తిరుమలలో ప్రారంభించనున్నారు. ఈ బృహత్ కార్యక్రమంలో భాగంగా దేశంలోని 106 వైష్ణవ దివ్యక్షేత్రాల మీదుగా రథయాత్రను నిర్వహించాలని టిటిడి భావించింది. ఈకార్యక్రమంలో ఆంధ్ర,తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ ఇ ఎస్ ఎల్ నరసింహన్ పాల్గొంటారు. ఇందులో టిటిడి శ్రీ వేంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో జి.బాలక్రిష్ణ ప్రసాద్, అనిల్‌కుమార్, ఆర్.బుల్లెమ్మ, కె.వందన ఆలపించిన అన్నయ్య రామానుజ కీర్తనం, కీర్తిశేషులు గోపాలాచారిస్వామి పారాయణం చేసిన నాలుగువేల పాశురాలు, నాలాయిర దివ్యప్రబంధం సిడీలను గవర్నర్ ఆవిష్కరించనున్నారు. అలాగే డాక్టర్ సముద్రాల లక్ష్మణయ్య రచించిన శ్రీరామానుజాచార్యుల వారి జీవిత చరిత్ర, కె.రమానుజ భట్టర్ అనువదించి, వ్యాఖ్యానించిన శ్రీ రామాజులవారి గద్యత్రయం, విశిష్టాద్వైతపరంగా రామానుజుల వారు అందించిన ఉపనిషత్తుల సారాంశం వేదార్ధ సంగ్రహం గ్రంథాలను విడుదల చేయనున్నారు. వీటితోపాటు ఆదికవి వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్రామాయణం యుద్ధకాండ 1,2 కాండాలను, డాక్టర్ సముద్రాల లక్ష్మణయ్య సరళవ్యాఖ్యానంతో రూపొందించిన ఉత్తర కాండను గవర్నర్ ఆవిష్కరించనున్నారు.
ఉత్సవాలు నిర్వహించడం ముదావహం-గవర్నర్ నరసింహన్
శ్రీ భగవద్ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలను టిటిడి ఏడాదిపాటు నిర్వహించడం ముదవహమని ఆంధ్ర,తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ అన్నారు. సోమవారం తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీరామానుజుల వారు సందర్శించిన 106 దివ్యప్రదేశాల్లో సంచార రథం పర్యటించి రామానుజ తత్వాన్ని ప్రచారం చేస్తుందని, ఎంపిక చేసిన ప్రాంతాల్లో శ్రీవారి కల్యాణాలు నిర్వహిస్తారని తెలిపారు.