చిత్తూరు

భక్తి శ్రద్ధలతో నృసింహ జయంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 4: అలిపిరి నడక మార్గంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో మంగళవారం నరసింహ స్వామి జయంతి ఘనంగా జరిగింది. కార్తీక మాసం, స్వాతి నక్షత్రం రోజున ప్రతి ఏడాది నరసింహ జయంతిని టీటీడీ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా జేఈఓ శ్రీనివాసరాజు మాట్లాడుతూ శ్రీవారి ఆలయ పోటు విభాగం ఆధ్వర్యంలో స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించినట్లు తెలిపారు. పాలు, పెరుగు, తేనె, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారన్నారు. ఈ పురాతన ఆలయానికి ఎంతో ప్రాశస్త్యం ఉందని, నడకదారిలో తిరుమలకు వచ్చే భక్తులందరూ నృసింహ స్వామిని దర్శించుకుంటారన్నారు. నడకదారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారు అనుగ్రహిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈఓ హరీంధ్రనాథ్, పేష్కార్ రమేష్ బాబు, ఓఎస్డీ పాలశేషాద్రి తదితరులు పాల్గొన్నారు.

తిరుచానూరులో ప్రదర్శనశాలలను ప్రారంభించిన టీటీడీ ఈఓ
తిరుపతి, డిసెంబర్ 4: శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుచానూరులో శుక్రవారపుతోటలో ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలలను టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ మంగళవారం ప్రారంభించారు. టీటీడీ ఉద్యానవిభాగం ఆధ్వర్యంలో పద్మావతమ్మను బంధించి.. ఆ తరువాత పూలబుట్టలో అమ్మవారిని పెట్టి స్వామికి సమర్పిస్తున్న అనంతాళ్వార్, శకటాసురుడిని సంహరిస్తున్న చిన్ని కృష్ణుడు, భస్మాసురుడిని అంతం చేస్తున్న మోహినీ అవతారంలో శ్రీ మహావిష్ణువు, అష్టలక్ష్మీ వైభవం, శూర్పణఖ ముక్కు, చెవులు కోస్తున్న లక్ష్మణుడు, అన్నమయ్యకు అవ్వ రూపంలో లడ్డూను అందజేస్తున్న పద్మావతమ్మ, శ్రీదేవి, భూదేవీ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి సైకత శిల్పం, కూరగాయలతో రూపొందించిన దేవతామూర్తుల మండపం, పుష్పాలతో వివిధ జంతువులు, పక్షుల ఆకృతులు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఎస్వీ ఆయుర్వేద కళాశాల ఆధ్వర్యంలో ఆయుర్వేద ప్రదర్శనశాల, ఫార్మశీ విభాగం ఆధ్వర్యంలో వనమూలికా ప్రదర్శన, ఉచిత ఆయుర్వేద వైద్య శిభిరం, ఎస్వీ సంప్రదాయ ఆలయ శిల్ప శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో కళల ప్రదర్శనశాల ఏర్పాటు చేశారు. ఈకార్యక్రమంలో తిరుపతి జేఈఓ పోలా భాస్కర్, సీవీఎస్వో గోపీనాథ్ జెట్టి, అదనపు సీవీఎస్వో శివకుమార్ రెడ్డి, తిరుపతి విజీఓ అశోక్ కుమార్ గౌడ్, ఆలయ డిప్యూటీ ఈఓ ఝాన్సీరాణి, గౌతమి, గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.