చిత్తూరు

శ్రీ పద్మావతి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాల సమర్పణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 4: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజైన మంగళవారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం తరపున పరిశ్రమల శాఖ మంత్రి ఎన్.అమరనాథరెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి టీటీడీ తిరుపతి జేఈఓ పోలా భాస్కర్, ఆలయ అర్చకులు, అధికారులు సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం ప్రసాదాలు అందజేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తరపున రెండోసారి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు చెప్పారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల కోసం టీటీడీ అన్ని వసతులు కల్పించిందన్నారు. భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో ఇటీవల నూతన అన్నప్రసాద భవనం నిర్మించడం సంతోషకరమన్నారు. తిరుపతిని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి ఆలోచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న, ఆలయ డిప్యూటీ ఈఓ ఝాన్సీరాణి, వీఎస్‌ఓ అశోక్‌కుమార్ గౌడ్, ఏఈఓ సుబ్రహ్మణ్యం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్ నరసింహన్

తిరుపతి, డిసెంబర్ 4: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని మంగళవారం సాయంత్రం తెలుగురాష్ట్రాల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్‌కు టీటీడీ తిరుపతి జేఈఓ పోలా భాస్కర్, అర్చక బృందం కలిసి సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం శేషవస్త్రం, తీర్థప్రసాదాలను అందించారు. ఈ సందర్భంగా గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషకరమన్నారు. తెలుగురాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, అందరికీ ఆరోగ్యం, సంపద ప్రసాదించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న, ఆలయ డిప్యూటీ ఈఓ ఝాన్సీరాణి, వీఎస్‌ఓ అశోక్‌కుమార్ గౌడ్, ఏఈఓ సుబ్రహ్మణ్యం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఘనంగా సౌభాగ్యం
తిరుపతి, డిసెంబర్ 4: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా తొలిరోజైన మంగళవారం సౌభాగ్యం కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, జేఈఓ పోలా భాస్కర్‌తో కలిసి మహిళలకు పసుపు, కుంకుమ, గాజులు, కంకణాలను పంపిణీ చేశారు. జగదేకమాత శ్రీ మహాలక్ష్మీ అవతారమైన పద్మావతీ అమ్మవారు అందరికన్నా పెద్ద ముత్తయిదువ. పసుపు, కుంకుమ, కాటుక, గాజులు, కమ్మలను సుమంగళీ ద్రవ్యాలుగా పెద్దలు చెబుతారు. ఆధునిక సమాజంలో పసుపు, కుంకుమల విలువను మరిచిపోతున్న యువతులకు వాటి ప్రాధాన్యతను తెలియజేసేందుకు టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో సౌభాగ్యం కార్యక్రమాన్ని 2012లో ప్రారంభించింది. నాటి నుంచి అమ్మవారి బ్రహ్మోత్సవాలు, వరలక్ష్మీవ్రతం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా, ఈ బ్రహ్మోత్సవాల్లో దాదాపు 50వేల మంది మహిళలకు పసుపు, కుంకుమ, కంకణాలు, 4 గాజులు చొప్పున అందిస్తారు. ఈ కార్యక్రమంలో హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యదర్శి డాక్టర్ రమణ ప్రసాద్, ఆలయ డిప్యూటీ ఈఓ ఝాన్సీరాణి ఇతర అధికారులు పాల్గొన్నారు.