చిత్తూరు

రాష్ట్రం విడిపోయినా ఏపీ అన్ని రంగాల్లో ముందుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 10: రాష్ట్రం విడిపోయిన తరువాత అనేక ఇబ్బందులు ఉన్నా రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతుల కోసం పలు కార్యక్రమాలు చేపట్టారని వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెల్లడించారు. సోమవారం ఉదయం స్థానిక శ్రీ వేంకటేశ్వర వ్యవసాయ కళాశాల ప్రాంగణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథ రెడ్డితో కలిసి మంత్రి సోమిరెడ్డి శ్రీకారం చుట్టారు. ఈసందర్భంగా మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నామని, వ్యవసాయ కళాశాల అభివృద్ధి కోసం 13 జిల్లాల్లో రూ. 158 కోట్లు ఖర్చు చేసి వసతులు కల్పిస్తున్నామన్నారు. గుంటూరు జిల్లా బాపట్ల ప్రధాన కార్యాలయం నిర్మాణం ఏర్పాట్లు జరుగుతున్నాయని, వీటివల్ల ఎంతోమంది రైతులకు మేలు కలుగుతుందన్నారు. గత నాలుగు సంవత్సరాలలో దేశం మొత్తం మీద అన్ని రంగాలలో ఏపీ గణనీయమైన అభివృద్ధి సాధించిందని, అభివృద్ధి రేటు 10.5 శాతం ఉందని, మిగిలిన 29 రాష్ట్రాల్లో ఎక్కడా నమోదు కాలేదని, దీనికి కారణం సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. దేశంలో బిందు సేద్యం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇలా ఎన్నో రంగాల్లో ప్రథమ స్థానంలో ఉన్నామని తెలిపారు. రాష్ట్రంలో రూ. 16వేల కోట్ల లోటుతో విడిపోతే, రూ. 1.5 లక్షలు రైతు రుణమాఫీ అందిస్తే, అన్నీ ఉన్న తెలంగాణలో రైతుల కోసం రూ. 1లక్ష ప్రకటించిందని తెలిపారు. హైదరాబాదును అభివృద్ధి చేసి వదలిపెట్టి వచ్చామని మంత్రి సోమరెడ్డి పేర్కొన్నారు. ఏపీలో ఈసారి వర్షపాతం లోటు 35శాతంగా ఉందని, అందుకే ముందస్తు చర్యలతో బిందు, తుంపర్ల సేద్యంకి వెళ్లి, ఉద్యానవన పంటపై మొగ్గు చూపామన్నారు. తిత్లీ తుఫాన్ వల్ల ఎక్కువగా కొబ్బరి చెట్లు దెబ్బతిన్నాయన్నారు. కేంద్ర ఎన్‌డిఆర్ ప్రకారం రైతులకు రూ. 500 చెల్లించాల్సి ఉంటే అందులో కేంద్రం రూ. 300, రాష్ట్రం రూ. 200 చెల్లించాల్సి ఉందన్నారు. సీఎం రైతులు కష్టాలను చూసి రూ. 1500 చొప్పన చెల్లించారని మంత్రి తెలిపారు. రైతు రుణమాఫీ పెద్ద ఎత్తున చేసినా ఇంకా ఒకరిద్దరు తమకు రాలేదని చెబుతున్న కారణంగా మళ్లీ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా మంగళవారం చిత్తూరులో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి సోమిరెడ్డి వివరించారు. రైతులకు అందుబాటులో నాలుగు వేలమంది ఎంపీఈఓలను నియమించామన్నారు. ఏపీలో వ్యవసాయంలో సాంకేతికతను తీసుకువచ్చామని, అధునాతన పనిముట్లు, ఉద్యాన పంటలు, ప్రకృతి సేద్యం వంటివి అమలు చేస్తున్నామన్నారు. పలురకాల విత్తన అభివృద్ధి కోసం రూ. 650 కోట్లతో మెగా సీడ్ పార్క్‌ను నిర్మించనున్నామన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ అయోవా యూనివర్శిటీ సహకారంతో నిర్మాణం ప్రారంభమైందని, రైతులకు అందుబాటులోకి రానున్నదన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ద్వారా మన రాష్ట్రంలో 19,414 మంది రైతులు లబ్ధి పొందారని, ఇందుకు కారణం రైతులు సాంకేతికతను వినియోగించుకని వ్యవసాయం చేయడమేనని తెలిపారు. రైతులకు సమస్యలుంటే 1100కు తెలియజేయాలని, ఆరోగ్యం ప్రధాన లక్ష్యంగా గత 10 రోజులుగా రోజుకు 8వేల మందికి ప్రకృతి వ్యవసాయంపై పాలేకర్‌తో శిక్షణ ఇప్పించామన్నారు.
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథ రెడ్డి మాట్లాడుతూ రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి మన ముఖ్యమంత్రన్నారు. మనది వ్యవసాయాధారిత జీవనమని, అందుకే సీఎం రైతురుణమాఫీ చేపట్టారన్నారు. గిట్టుబాటు ధరలను కల్పిస్తున్నట్లు వివరించారు. 2014లో ఉన్న కరెంటు కోతలు ఇప్పుడు దరిదాపుల్లో కూడా లేవని, బిందుసేద్యం, ఉద్యానవన పంటల ప్రోత్సాహంతో రైతులకు, మనకు మేలు జరుగుతోందన్నారు. ప్రధానంగా కో ఆపరేటివ్ షుగర్, ప్రైవేట్ చక్కెర కర్మాగారాలు నష్టాలతో మూతపడటంపై హైపవర్ కమిటీని నియమించి నివేదిక తెప్పించామని, త్వరలోనే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ముందుంచి ఒక పరిష్కారం చూపనున్నామని మంత్రి వివరించారు. సభ ప్రారంభానికి ముందు వ్యవసాయ కళాశాలలో ఎన్‌జీ రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రూ. 4.5 కోట్లతో నిర్మించనున్న బాలికల వసతి సముదాయానికి, రూ.12 కోట్లతో నిర్మించనున్న అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్ భవనానికి, రూ. 10.85 కోట్లతో నిర్మించనున్న అత్యాధునిక వ్యవసాయ పరిశోధన ప్రయోగశాల భవనాలకు శంకుస్థాపనలు చేశారు. రూ. 1.35 కోట్లతో నిర్మించిన ఘన, ద్రవ జీవన ఎరువుల ఉత్తత్పి కేంద్రాన్ని మంత్రులు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాల పరిశోధన సంచాలకులు ఎస్వీ నాయుడు, తిరుపతి ప్రాంతీయ పరిశోధనా స్థానం సహాయ సంచాలకులు రాజశేఖర్, పలువురు ఆచార్యులు, అధ్యాపకులు, కళాశాల దత్తత గ్రామాల రైతులు, విద్యార్థులు పాల్గొన్నారు.