చిత్తూరు

కలికిరి కొండను తిరుమల తరహాలో అభివృద్ధి చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూతలపట్టు, డిసెంబర్ 12: కలికిరి కొండ ఆలయానికి ఎంతో విశిష్టత ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని తిరుమల తరహాలో అభివృద్ధి చేయడానికి తమ వంతు కృషి చేస్తామని రాష్ట్ర మంత్రి అమరనాథరెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, రామచంద్రనాయుడు చేతుల మీదుగా సుదర్శనయాగం నిర్వహించారు. ఈ సుదర్శన యాగానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి అమరనాథరెడ్డితో పాటు టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్, జడ్పీ చైర్‌పర్సన్ గీర్వాణి, ఎమ్మెల్సీ దొరబాబు, నటుడు సుమన్, తారకరత్న విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రి అమరనాథరెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ తిరుమలలో జరిగే ఉత్సవాల్లాగా కలికిరి కొండలో యధావిధిగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉందని, భక్తులు కూడా ఈ స్వామివారంటే విశ్వసిస్తారని, కావున ఈ ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి మరో తిరుమలగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు. అలాగే కలికిరి కొండపై మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, రామచంద్రనాయుడు మహా సుదర్శనయాగం నిర్వహించడం, చుట్టుపక్కల ఉన్న భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. కలికిరి కొండను అభివృద్ధి చేసేందుకు తిరుమల, తిరుపతి దేవస్థానంతో పాటు 1893వ సంవత్సరం కలికిరి కొండకు కూడా 10 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ జీవో ఇచ్చారన్నారు. ఇప్పటికే ఆలయ పునః నిర్మాణం కోసం రూ.2 కోట్ల 90 లక్షలు, లింకురోడ్డుకు రూ.3 కోట్ల 90 లక్షలు, రెండు చెరువుల నిర్మాణం కోసం రూ.20 లక్షలు మంజూరు చేసిందన్నారు. కలికిరి కొండను తిరుమలకు దత్తతకు తీసుకోవాలని టీటీడీ చైర్మన్‌ను కోరారు. అలాగే అభివృద్ధిలో టూరిజం హబ్‌గా చేయాలని కోరారు. తిరుమల గుడికి వచ్చిన వారు కలికిరి కొండకు వచ్చి కాణిపాకం గుడికి వెళ్లేలా కొండను అభివృద్ధి చేయాలన్నారు. దీనితో టీటీడీ చైర్మన్ స్పందించి వినతిపత్రం అందచేస్తే బోర్డు సమావేశంలో మాట్లాడి పరిష్కరిస్తామన్నారు. అనంతరం ఆలయ పరిసరాలను సందర్శించి ఆలయ ప్రతిష్టతను మంత్రి టీటీడీ చైర్మన్‌కు వివరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ గీర్వాణి, ఎమ్మెల్సీ దొరబాబు, జిల్లా అధ్యక్షులు నాని, ఎంపీపీ వీణ, జడ్పీటీసీ వనజ, సుబ్బారెడ్డి, తలపులబాబురెడ్డి, తెలుగు యువత యువరాజులనాయుడు, మురళిమోహన్, కృష్ణమనాయుడు, పెనుమూరు మండల ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.