చిత్తూరు

వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారికి శ్రీవారి సారె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 12: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం శ్రీవారి సారెను తిరుమల నుండి తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్దకు తీసుకువచ్చారు. శ్రీవారి సారెకు ప్రత్యేక పూజలు చేసి తిరుమల జేఈఓ శ్రీనివాస రాజు తిరుపతి జేఈఓ పోలా భాస్కర్‌కు అందించారు. పసుపు, కుంకుమ, ప్రసాదాలు, తులసి, వస్త్రాలు, ఆభరణాలతో కూడిన సారెను తిరుపతి కోమలమ్మ సత్రం, గోవిందరాజ స్వామి ఆలయం, ఆర్టీసీ బస్టాండ్ మీదుగా తిరుచానూరు పసుపు మండపానికి ఊరేగింపుగా తీసుకువచ్చి పుష్కరిణి వద్ద అమ్మవారికి సారెను సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, సీవీఎస్వో గోపీనాథ్ జెట్టి, శ్రీవారి ఆలయ ఓఎస్డీ శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు
* లక్ష మందికి అన్నప్రసాదాలు
తిరుపతి, డిసెంబర్ 12: తిరుచానూరులోని శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో తొమ్మిది రోజులపాటు జరిగిన కార్తీక బ్రహ్మోత్సవాలు బుధవారం పంచమీతీర్థ మహోత్సవంతో ఘనంగా ముగిసాయి. చివరిరోజు ఆలయం వద్ద ఉన్న పద్మ పుష్కరిణిలో జరిగిన చక్రస్నానం కార్యక్రమానికి విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చి పవిత్ర స్నానాలు ఆచరించారు. ఈ ఉత్సవానికి విచ్చేసిన భక్తజన వాహినికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది.
లక్ష మందికి అన్నప్రసాదాలు
టీటీడీ అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో సుమారు లక్ష మంది భక్తులకు అన్నప్రసాదాలు, ఉదయం 50వేల మందికి అల్పాహారం అందించారు. భక్తుల సౌకర్యార్థం అదనంగా 60 అన్నప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేశారు. తోళ్ళప్పగార్డెన్‌లో 26, ఎస్వీహైస్కూల్ వద్ద 18, అయ్యప్ప స్వామి ఆలయం వద్ద 16 అన్నప్రసాదం కౌంటర్లలో భక్తులకు కదంబం, చక్కెర పొంగళి అందజేశారు. అన్నప్రసాద వితరణకు 120 మంది సిబ్బంది, 150 మంది శ్రీవారి సేవకులు సేవలందించారు. అన్నప్రసాద విభాగం ప్రత్యేక అధికారి వేణుగోపాల్, క్యాటరింగ్ అధికారి టి.దేశయ్య అన్నప్రసాద వితరణ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు
పంచమీ తీర్థానికి విచ్చేసిన భక్తుల కోసం టీటీడీ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. పుష్కరిణిలోకి ప్రవేశించేందుకు 11 గేట్లు, తిరిగి వెళ్లేందుకు 17 గేట్లను ఏర్పాటు చేశారు. పుష్కరిణి వద్ద భద్రతా ఏర్పాట్లను తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బురాజన్, టీటీడీ సీవీఎస్వో గోపీనాథ జెట్టి, అదనపు సీవీఎస్వో శివకుమార్ రెడ్డి, డీఎస్పీ మునిరామయ్య, వీఎస్వోలు అశోక్ కుమార్ గౌడ్, సదాలక్ష్మి, మనోహర్ ఆధ్వర్యంలో విజిలెన్స్ అధికారులు, పోలీసులు అధికారులతో సమన్వయం చేసుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పార్కింగ్ ఏర్పాట్లు, ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు. టీటీడీ భద్రతా సిబ్బంది 300 మంది, స్కౌట్స్ అండ్ గైడ్స్ 200 మందిని ఎన్‌సీసీ విద్యార్థులు 200 మంది, శ్రీవారి సేవకులు 200 మంది, పోలీస్ సిబ్బంది 1500 మందితో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన భక్తులకు శ్రీవారి సేవకులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ విశేష సేవలు అందించారు. ఆలయంలోని క్యూలైన్లు, వాహన సేవల్లో, అన్నప్రసాద భవనంలో భక్తులకు సేవలందించారు.
రెండు లక్షల వాటర్ ప్యాకెట్లు పంపిణీ
పంచమీ తీర్థానికి విచ్చేసిన లక్షలాది మంది భక్తులకు టీటీడీ ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో దాదాపు 2లక్షల తాగునీటి ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఆలయం, పుష్కరిణి సమీపంలో ఎప్పటికప్పుడు చెత్తను తొలగించి పరిశుభ్రంగా ఉంచారు. భక్తుల సౌకర్యార్థం 314 శాశ్విత, తాత్కాలిక, మొబైల్ మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాల్లో రోజుకు 300 మంది, పంచమీతీర్థం రోజున 600 మంది పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.
భక్తులకు విశేషంగా వైద్య సేవలు
బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన భక్తులకు, అమ్మవారి వాహనం మోసే వాహన బేరర్లకు వైద్య పరంగా తగిన చర్యలు తీసుకున్నారు. టీటీడీ వైద్యులతోపాటు స్విమ్స్, రుయా ఆస్పత్రుల వైద్యులు, ఆయుర్వేద వైద్య సిబ్బంది సేవలందించారు. మూడు ప్రాంతాల్లో ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేశారు.
సాంస్కృతిక కార్యక్రమాలకు విశేష స్పందన
హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ప్రతిరోజూ వాహన సేవల్లో కోలాటాలు, భజనలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలకు విశేష స్పందన లభించింది. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చిన జానపద కళాబృందాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.