చిత్తూరు

అంతర్జాతీయ ప్రమాణాలతో తిరుపతి స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 14: ఆధ్యాత్మిక నగరం తిరుపతిని స్మార్ట్‌సిటీ ప్రాజెక్టుతో అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దడమే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఎన్.అమరనాథ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం మధ్యాహ్నం తుడా కార్యాలయంలో మంత్రి స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు పనులను సమీక్షించారు. అనంతరం మంత్రి విలేఖర్లతో మాట్లాడుతూ ఐదు సంవత్సరాల కాలంలో తిరుపతి అభివృద్ధికి రూ.1915 కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. జనవరి 2019 నాటికి రూ. 1000 కోట్లతో అభివృద్ధి పనులకు టెండర్లు పూర్తి చేయడం జరుగుతుందని, దాదాపు రూ.120 కోట్ల పనులకు ప్రారంభోత్సవాలు జరుగుతాయన్నారు. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు నిధులు కార్పొరేషన్ పరిధిలోనే ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. సీఎం ప్రత్యేక శ్రద్ధతో తిరుపతి నగరం నివాసయోగ్యమైన నగరాల్లో నాల్గవ స్థానం, భద్రతలో రెండో స్థానం సాధించిందని మంత్రి తెలిపారు. దేశ, విదేశాల నుంచి శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు పరిశుభ్రత, పచ్చదనంతోపాటు, అత్యంత నివాస యోగ్యం, భద్రత కల్పించడం ప్రధాన ధ్యేయమన్నారు. స్మార్ట్‌సిటీలో భాగంగానే తిరుపతిలో అభివృద్ధి, సోలార్ పవర్, డిజిటల్ క్లాస్ రూమ్స్ రూపు దిద్దుకుంటున్నాయన్నారు. నగరంలో ఐటీఎం, సీసీ కెమేరాల ఏర్పాటుతో ట్రాఫిక్, సిగ్నల్స్, వాతావరణాన్ని ఒకేచోటు నుంచి తెలుసుకునే కమాండ్ కంట్రోల్ రూమ్ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. తిరుపతిలో స్మార్ట్‌స్ట్రీట్స్, బస్ స్ట్ఫాల అభివృద్ధి, తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ నుంచి రైల్వేస్టేషన్ వరకు 600 మీటర్లు ఎస్కెలేటర్ సౌకర్యం కల్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందులో టీటీడీ, తుడా, నగరపాలక సంస్థ, ఏపీ ఎస్‌పీడీసీఎల్ సమన్వయంతో నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తారని మంత్రి అమరనాథ రెడ్డి తెలిపారు. ఆధ్యాత్మిక క్షేత్రంలో భిక్షగాళ్ల సమస్య ఉందని, రాస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వారికి ప్రత్యేక సౌకర్యాలు, వసతి, భోజనం, పని కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. తిరుపతిలో 44 పాఠశాలల అభివృద్ధి, స్పోర్ట్స్ అరెనా ఏర్పాటు, మూడు వేలమందికి సరిపడా కనె్వన్షన్ సెంటర్ ఏర్పాటుకు రూపకల్పన జరునున్నదని మంత్రి తెలియజేశారు. ఎలివేటెడ్ కారిడార్‌కు త్వరలో జీఓ రానుందని, దీనికి సీఎం శంకుస్థాపన చేయనున్నారని చెప్పారు. నగరంలో కేబుల్స్ అస్తవ్యస్తంగా ఉండటంతో భూగర్భ కేబుల్స్ నిర్మాణానికి ఏపీ ఎస్‌పీడీసీఎల్ దాదాపు రూ.350 కోట్లతో పనులు చేపట్టి, నగర ప్రజలకు ఇబ్బందులు లేకుండా పనులు జరుగుతున్నాయన్నారు. ప్రతి పని ప్రణాళికాబద్దంగా అంతర్జాతీయ ప్రమాణాలతో, భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా చేయనున్నామన్నారు. అంతకుమునుపు మంత్రి స్థానిక నారాయణాద్రి హాస్పిటల్‌లో డయాలసిస్ యూనిట్‌ను ప్రారంభించారు. నగరంలో స్మార్‌సిటీ ప్రాజెక్టు పనులు జరుగుతున్న ప్రకాశం పార్కు, నెహ్రూ మున్సిపల్ మైస్కూల్, ఇందిరా మైదానంను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, నగరపాలక సంస్థ కమిషనర్ విజయరామ రాజు, తుడా చైర్మన్ నరసింహ యాదవ్, తుడా డైరెక్టర్లు ధనంజయ నాయుడు, రామస్వామి, బాలకృష్ణ మూర్తి, తుడా కార్యదర్శి మాధవీలత, శాఫ్ డైరెక్టర్ శ్రీ్ధర్ వర్మ తదితరులు పాల్గొన్నారు.

మైనారిటీల అభివృద్ధి టీడీపీకే సాధ్యం
* ఉపముఖ్యమంత్రి చిన్నరాజప్ప స్పష్టం
కలకడ, డిసెంబర్ 14: మైనారిటీల అభివృద్ది టీడీపీ ప్రభుత్వానికే సాధ్యమని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప స్పష్టం చేసారు. శుక్రవారం కలకడలో జరిగిన ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముస్లిం, మైనార్టీల అభివృద్దికి పలు పథకాలు రూపొందించి అమలు చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎంఐఎం పార్టీ అధినేత అక్బరుద్దీన్ ఒవైసీ అంధ్ర రాష్ట్రంలో 2019లో జరిగే ఎన్నికల్లో జగన్‌కు మద్ధతుగా ప్రచారం చేస్తామని ప్రకటించటాన్ని ప్రస్తావిస్తూ ఆయనకు దేశంలో ఎక్కడైనా ప్రచారం చేసే స్వేచ్ఛ ఉందన్నారు. రాష్ట్రంలో ఎంఐఎం పార్టీ నాయకులు పర్యటిస్తే మైనారిటీలు టీడీపీ పక్షన ఉన్నారనే విషయం అర్థమవుతుందన్నారు. మండల మైనారిటీ నాయకులు హోంమంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మధ్యపట్ల సూర్యప్రకాష్, జడ్పీటీసీ తిరుపతినాయుడు పాల్గొన్నారు.

నేడు నారావారిపల్లిలో ఉదయ్‌కుమార్ అంత్యక్రియలు
* నారావారిపల్లికి చేరుకున్న మంత్రి లోకేష్
* నేడు ముఖ్యమంత్రి రాక
చంద్రగిరి, డిసెంబర్ 14: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మేనల్లుడు కనుమూరి ఉదయ్‌కుమార్ అంత్యక్రియలు శనివారం నాడు కందులవారిపల్లిలో జరగనున్నాయి. ఈ నేపధ్యంలో ఇప్పటికే మంత్రి నారా లోకేష్, ముఖ్యమంత్రి సతీమణి భువనేశ్వరి దేవి, కోడలు బ్రాహ్మణిలతో పాటు పెద్ద సంఖ్యలో బంధువులు, ప్రముఖులు నారావారిపల్లికి చేరుకున్నారు. కాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం ఉదయం 9.10 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని అక్కడ నుండి రోడ్డు మార్గంలో కందులవారిపల్లికి చేరుకుంటారు. ఉదయ్‌కుమార్ మృతదేహానికి నివాళులు అర్పించి అంత్యక్రియల్లో పాల్గొని మధ్యాహ్నం 2గంటలకు బయలుదేరి రేణిగుంట నుండి ప్రత్యేక విమానంలో గన్నవరంకు వెళ్లనున్నారు.

రెండు ప్రాణాలు బలికొన్న రోడ్డు విస్తరణ పనులు
* లారీ, కంటైనరు ఢీ- ఇద్దరు మృతి
పలమనేరు, డిసెంబర్ 14: రోడ్డు విస్తరణ పనులు రెండు నిండుప్రాణాలను బలికొన్నాయి. పలమనేరు-కుప్పం రహదారిపై కొలమాసనపల్లి పంచాయతీ సాకేవూరు వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు, గ్రామస్తుల కథనం ప్రకారం సాకేవూరు వద్ద రోడ్డు విస్తరణలో భాగంగా రోడ్డుపై ఉన్న దుమ్ము, దూళిని ప్రత్యేక వాహనంతో శుభ్రం చేస్తుండగా రోడ్డుమొత్తం దుమ్ముతో నిండిపోయింది. ఈ క్రమంలో పలమనేరు నుంచి కోయంబత్తూరుకు సిమెంట్ లోడుతో వెడుతున్న లారీ, కుప్పం వైపు నుంచి కేరళ రాష్ట్రం గుడివాడకు వస్తున్న చేపల కంటైనర్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో రెండు లారీల క్యాబిన్లు ఒకదానితో ఒకటి ఇరుక్కు పోవడంతో ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్ క్యాబిన్లలో ఇరుక్కుపోయారు. వెంటనే స్పందించిన గ్రామస్తులు క్లీనర్‌ను బయటకు లాగి ఆటోలో పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి జేసీబీల సహాయంతో ఇద్దరు డ్రైవర్లును అతికష్టంగా బయటకు తీసి పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనలో కృష్ణజిల్లా పామర్రుకు చెందిన సాయి, కాళి అనే ఇద్దరు డ్రైవర్లు మృతిచెందారు. మరో డ్రైవర్ రమేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పలమనేరు సీఐ ఈదర్‌భాషా, బైరెడ్డిపల్లి ఎస్సై రాజా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. పలమనేరు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.