చిత్తూరు

శ్రీవారిని దర్శించుకున్న 63వేల మంది భక్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 18: వైకుంఠ ఏకాదశి పర్వదినాన మంగళవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 63,070 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. రూ. 3.28 కోట్లు ఆదాయం లభించింది. సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. మరో లక్ష మంది భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచివున్నారు. ఇందులో 20వేల మందికి మంగళవారం అర్థరాత్రి వరకు స్వామిని దర్శించుకునే అవకాశం లభించింది. మిగిలిన వారికి ద్వాదశి రోజున దర్శించుకోనున్నారు. కాగా ద్వాదశి దర్శనానికి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

వైభవంగా శ్రీవారి రథోత్సవం
తిరుపతి, డిసెంబర్ 18: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం తిరుమలలో స్వర్ణరథోత్సవం వైభవంగా జరిగింది. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీవారి రథరంగ డోలోత్సవాన్ని పురమాడ వీధుల్లో నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, జేఈఓ శ్రీనివాసరాజు ఇతర అధికారులు పాల్గొన్నారు.
నేడు చక్రస్నాన మహోత్సవం
వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం ఉదయం 4.30 నుంచి 5.30 గంటల మధ్య శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ చక్రస్నాన మహోత్సవం వైభవంగా జరుగనుంది. ఈ సందర్భంగా శ్రీ స్వామి పుష్కరణీ తీర్థంలో చక్రస్నాన సుముహూర్తాన ఎవరైతే స్నానమాచరిస్తారో అటువంటి వారికి తిరుమల శేషగిరులలో వెలిసివున్న 66 కోట్ల పుణ్యతీర్థ స్నానఫలం దక్కుతుందని ప్రాశస్త్యం. కాగా వైకుంఠ ద్వాదశినాడు కూడా తిరుమల శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.