చిత్తూరు

తిరుపతిలో భోగి పండుగ సంబరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 14: భోగి పండుగను సోమవారం తిరుపతి ప్రజలు ఎంతో ఆనందోత్సాహల మధ్య జరుపుకున్నారు. నూతన సంవత్సరంలో వచ్చే తొలి పండుగైన భోగిని అన్ని వర్గాల ప్రజలు సంబరంగా జరుపుకున్నారు. కొందరు అర్ధరాత్రి 12 గంటలు దాటి తరువాత తమ ఇళ్ల ముందు భోగి మంటలు వేస్తే, మరి కొందరు చలికి భయపడి ఉదయం 6 గంటల ప్రాంతంలో భోగి మంటలు వేసుకున్నారు. తమ ఇళ్లలోని పాత వస్తువులను తెచ్చి మంటల్లో వేసి సాంప్రదాయ బద్దంగా నిర్వహించుకున్నారు. భోగి మంటల్లో దీపం వెలిగించి ఇళ్లల్లో దేవుని ముందు పెట్టి అభ్యంగన స్నానాలు ఆచరించి పూజలు చేశారు. తిరుపతిని స్వచ్ఛ సర్వేక్షన్‌లో దేశంలోనే తొలి స్థానంలో నిలపడానికి ప్రజలు కొన్ని పద్ధతులు పాటించాలని నగర పాలక సంస్థ కమిషనర్ విజయరామ రాజు చేసిన సూచనలు కొందరు పాటిస్తే మరి కొందరు పట్టించుకోని పరిస్థితి కనిపించింది. ఈనెల 20వ తేదీలోగా తిరుపతిలో స్వచ్ఛ సర్వేక్షన్ బృందం పర్యటించనున్న నేపథ్యంలో సీసీ రోడ్లు, తారు రోడ్లపైన భోగి మంటలు వేయకుండా మట్టి ప్రాంతాల్లో వేయాలని, రోడ్లపైన వేయాల్సి వస్తే ముందుగా మట్టి వేసి దానిపైన భోగి మంటలు వేయాలని కమిషనర్ ప్రజలకు సూచించారు. ఈమేరకు నగరంలో ఎక్కువ ప్రాంతాల్లో కమిషనర్ సూచనలను ప్రజలు పాటించారు. పెద్ద ఎత్తున భోగి మంటలు వేయకుండా, టైర్లు, ప్లాస్టిక్ వస్తువులు కాల్చకుండా వ్యవహరించారు. దీంతో నగరంలో గతంలోలా కాకుండా ఉదయానే్న దట్టమైన పొగలు లేకుండాపోయింది. నగరపాలక సంస్థ పారిశుద్ధ్య సిబ్బంది తెల్లవారు జామునే రోడ్లపై ఆరిపోయిన భోగి మంటల బూడిదను వెంటనే తొలగించారు. నారావారి పల్లెకు సీఎం కుటుంబ సమేతంగా తరలివచ్చినా పార్టీ నేతలు ఎవరూ నారావారిపల్లెకు రావద్దని, సంక్రాంతి పండుగనాడు మధ్యాహ్నం పైనే రావాలని సీఎం స్పష్టం చేయడంతో జిల్లాలోని టీడీపీ ముఖ్య నేతలు తమ తమ ప్రాంతాలకే పరిమితమయ్యారు. తుడా చైర్మన్, టీడీపీ జిల్లాప్రధాన కార్యదర్శి నరసింహ యాదవ్ ఇంటి వద్ద జరిగిన భోగి మంటల కార్యక్రమంలో తిరుపతి మాజీ ఎమ్మెల్యేలు మోహన్, జీవీ శ్రీనాధ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు గుణశేఖర్, నాయకుడు దేవ పాల్గొన్నారు.