చిత్తూరు

రాజూ.. ఆరోగ్యం ఎలా ఉంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 14: రాజూ.. ఆరోగ్యం ఎలా ఉంది అంటూ ఎన్‌టీఆర్ కుమారుడు రామకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులు టీటీడీ మాజీ బోర్డు సభ్యుడు, శాప్ డైరెక్టర్ శ్రీ్ధర్ వర్మ తండ్రి ఎన్‌టీఆర్ రాజును పరామర్శించారు. స్వర్గీయ ఎన్‌టీఆర్ కుమారుడు తన కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఈసందర్భంగా వారు ఆర్‌బీ సెంటర్‌లో నివాసం ఉంటున్న ఎన్‌టీఆర్ రాజు గృహానికి వెళ్లి పరామర్శించారు. ఈసందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ నాడు తన తండ్రి పార్టీ పెట్టినపుడు ఎన్నో మైలురాళ్లను దాటుతూ రాష్టమ్రంతా తిరుగుతూ పార్టీజెండాను రెపరెపలాడించడంలో ఎన్‌టీఆర్ రాజు (రామచంద్రరాజు) కృషిని గుర్తుచేశారు. త్వరగా ఆరోగ్యవంతులు కావాలని ఆకాంక్షించారు. ఎళ్లవేళలా మీ కుటుంబానికి తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
సీఎం రిలీఫ్ ఫండ్‌కు వినతి
సంక్రాంతి సంబరాల సందర్భంగా తన స్వగ్రామమైన నారావారి పల్లికి వెళ్లడానికి విజయవాడ నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రిని తిరుపతిలోని 6వ వార్డుకు చెందిన తెలుగు మహిళా మాజీ అధ్యక్షురాలు సరోజమ్మ కలిశారు. ఈసందర్భంగా ఆమె సీఎం చంద్రబాబునాయుడుతో మాట్లాడుతూ తన భర్త అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఇప్పటికే లక్షలాది రూపాయలు వ్యయం చేసి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని వివరించారు. తన భర్తకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి నిధులు కేటాయించి ఆదుకోవాలని కోరారు. ఆమెవెంట రాష్ట్ర శాప్ డైరెక్టర్ శ్రీ్ధర్ వర్మ, సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఎండీ, టీడీపీ సీనియర్ నాయకులు అశోక్‌రాజు తదితరులు ఉన్నారు.