చిత్తూరు

సంక్రాంతి జిల్లా వాసుల్లో సరి కొత్త కాంతులు నింపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, జనవరి 14: జిల్లా ప్రజల జీవితాల్లో ఈ సంక్రాంతి సరికొత్త కాంతులు నింపాలని రాష్ట్ర మంత్రి అమరనాథ్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్నలు తెలిపారు. జిల్లా ప్రజలకు మంత్రి , కలెక్టర్‌లు ప్రకటలో సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంస్కృతి సంప్రదాయాలకు పత్రీకగా జరుపుకొనే సంక్రాంతి పండుగ ప్రతి ఇంటా సిరులు పంటను పండించాలని పేర్కొన్నారు. ఈ సంవత్సరం వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండి జిల్లా వాసులు సుభిక్షంగా, సిరి సంపదలతో తులతూగాలని ఆకాంక్షించారు. జిల్లాలో మూడు రోజులు పాటు జరుపుకొనే సంక్రాంతి పండుగను జిల్లా వాసులు ప్రశాంతంగా సంతోషంగా జరుపుకోవాలని తెలిపారు. ఇప్పటికు పలు రంగాల్లో జిల్లాకు ప్రత్యేక గుర్తింపు దక్కిందని, ఈ సంవత్సరం అభివృద్ధిలో జిల్లా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలపడానికి అందరూ సహకరించాలని కోరారు.