చిత్తూరు

తిరుమలలో జేఈఓ తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 22: తిరుమలలో జరుగుతున్న అభివృద్ధి పనులను జేఈఓ శ్రీనివాసరాజు మంగళవారం అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ఇందులో భాగంగా బాలాజీనగర్‌లో నూతనంగా నిర్మిస్తున్న డ్రైనేజి, విద్యుత్ దీపాలు, ఇతర పనులను పరిశీలించారు. స్థానికులకు మంచి నీరు అందించేందుకు ఏర్పాటుచేస్తున్న ఆర్‌ఓ ప్లాంట్‌ను కూడా పరిశీలించారు. వినాయక స్వామి ఆలయ అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ బాలాజీ నగర్ వాసుల సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. అంతకుమునుపు పీఏసీ-2లోని వంటశాలను పరిశీలించి విస్తరించడానికి పలు సూచనలను అధికారులకు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ-2 రామచంద్రారెడ్డి, ఎస్‌ఈ ఎలక్ట్రికల్ వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఏప్రిల్ 25న మహర్షి చిత్రం విడుదల
* శ్రీవారిని దర్శించుకున్న ఎఫ్-2 చిత్ర నిర్మాత దిల్‌రాజు
తిరుపతి, జనవరి 22: సంక్రాంతికి విడుదలైన ఎఫ్-2 చిత్రం విజయవంతం కావడంతో ఆ చిత్ర నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు అనిల్ మంగళవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల దిల్ రాజు విలేఖరులతో మాట్లాడుతూ మహర్షి చిత్రం ఏప్రిల్ 25న విడుదల కానున్నట్లు తెలిపారు. మరో 4 చిత్రాలను నిర్మించనున్నట్లు చెప్పారు. తాను నిర్మించిన ఎఫ్-2 చిత్రాన్ని ప్రేక్షకులు విశేషంగా ఆదరించడంతో ఘన విజయం సాధించిందన్నారు. ఈ నేపథ్యంలో స్వామివారి ఆశీస్సులు పొందేందుకు తిరుమలకు వచ్చానన్నారు. ఇందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు.