చిత్తూరు

ఏపీలో ఎస్సీ రిజర్వేషన్‌పై రాజకీయ పార్టీల కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లె, జనవరి 22: నాలుగున్నర సంవత్సరాలక్రితం ఏర్పడిన ఏపీలో ఎస్సీ రిజర్వేషన్‌పై అన్ని రాజకీయపార్టీల కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కొనేందుకు ఫిబ్రవరి 19న చేపడుతున్న విశ్వరూప మహాసభను జయప్రదం చేయాలని మంగళవారం రాత్రి మదనపల్లెకు వచ్చిన మంద కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. మంగళవారం రాత్రి స్థానిక కదిరిరోడ్డులోని సంగం ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటుచేసిన జిల్లాలోని ముఖ్యప్రతినిధుల సమావేశానికి హాజరైన మంద కృష్ణ మాదిగ మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విభజన అనంతరం ఏర్పడిన ఏపీలో నాలుగున్నర సంవత్సరాల్లో ఎమ్మార్పీఎస్ అస్థిత్వాన్ని, ఉనికిని ప్రశ్నార్థకం చేస్తూ మాదిగలకు చెందాల్సిన అన్ని రకాల అవకాశాలను రానీయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మాదిగల సంఖ్యాబలం అతితక్కువగా ఉందని దుష్ప్రచారం చేస్తున్న స్వార్థపరుల కుట్రలను, వారికి వత్తాసు పలుకుతున్న వివిధ రాజకీయ పార్టీల కుట్రలు, కుతంత్రాలను ఛేదించడానికి ఫిబ్రవరి 19న అమరావతిలో లక్షలాది మందితో విశ్వరూపమహాసభ నిర్వహిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణ పిలుపునిచ్చారు. జనవరి 7వ తేదీన కేంద్రం ఈబీసీలకు 10శాతం రిజర్వేషన్ పెంచడం, రాజ్యసభ, పార్లమెంట్ ఆమోదం, రాష్టప్రతి ఆమోదముద్ర వేశారన్నారు. రిజర్వేషన్‌లకు తాము వ్యతిరేకం కాదన్నారు. దేశంలో ఎక్కడా ఉద్యమాలు చేయకుండానే, ఏ కమిషన్‌లు నియమించకుండానే ఈబీసీలకు 10శాతం రిజర్వేషన్ కల్పించడం, గత పాతికేళ్లుగా ఎస్సీ వర్గీకరణ కోసం నిరాటకంగా ఉద్యమాలు చేస్తుండగా, అన్ని కమిషన్‌లు వర్గీకరణ చేయాలని సిఫారుసులు ఉండగా, ఇంతవరకు బీజెపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ఎస్సీవర్గీకరణ ఆగదని, రేపోమాపో జరగక తప్పదని గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా ఎమ్మార్పీఎస్ వర్గీకరణ కోసం చేస్తున్న ఉద్యమాలు తీవ్రత, బీజేపీ అవకాశం కోసమైనా ఎస్సీ వర్గీకరణ చేయడం తథ్యమన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మాదిగల ఉనికికే పెద్ద ప్రమాదం పొంచి ఉందన్నారు. ఈప్రమాదం నిలువరించాడానికే విశ్వరూప మహాసభ నిర్వహించనున్నట్లు తెలిపారు. మాదిగల ఆత్మగౌరవాన్ని, హక్కులను సాధించగలుగుతామన్నారు. తెలంగాణాలో ఎస్సీవర్గీకరణకు అన్ని రాజకీయ పార్టీలు అనుకూలంగా ఉంటూనే, ఆయా పార్టీల మ్యానిఫెస్టోలో పెట్టడం జరిగిందని, ఏపీలో అదే రాజకీయ పార్టీలు వౌనంగా ఉండటం, మాదిగల హక్కులను కాలరాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఎస్సీ వర్గీకరణపై టీడీపీ, వైసీపీ, బీజెపీ, కాంగ్రెస్, జనసేన, సీపీఐ, సీపీఎం పార్టీలు తమ స్పష్టమైన వైఖరి తెలపాలని డిమాండ్ చేశారు. స్వార్థంగా ఆలోచన చేస్తున్న రాజకీయ కుట్రలు, కుతంత్రాలపై ఫిబ్రవరి 19న అమరావతిలో విశ్వరూప మహాసభ నిర్వహిస్తున్నట్లు మంద కృష్ణ వెల్లడించారు. ఈసభకు లక్షలాదిగా తరలి రావాలాని పిలుపునిచ్చారు. ఈసమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికారప్రతినిధి నరేంద్రబాబు, జిల్లా నాయకులు ఆరేటివాసు, మునిరాజు, మనోహర్, మిద్దింటి వెంకటస్వామి, గోపి, ఈశ్వరప్ప, దేవరాజు, వెంకటేష్, వౌలాలి, ఆర్డీఎస్ రమణ, కె.ప్రసాద్, వెలుగుచంఅద, రమణ, ప్రతాప్, చౌడప్ప, పీవీరమణ, చలపతి, నరసింహులు తదితరులు ఉన్నారు.