చిత్తూరు

జిల్లాలో 14 మంది ఎస్సైలకు స్థానచలనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, జనవరి 22: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా పోలీసు శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా చిత్తూరు పోలీసు జిల్లా పరిధిలో 14 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ మంగళవారం అనంతపురం రేంజి డిఐజి క్రాంతి రాణా టాటా ఆదేశాలు జారీ చేశారు. ఇదివరకే ఈ జిల్లా పరిధిలో 11 మంది ఎస్సైలను బదిలీ చేయగా తాజాగా మరో 14 మందికి స్థానచలనం కల్పించారు. ప్రస్తుతం పెనుమూరు ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న వంశీధర్‌ను కలకడకు, చిత్తూరు ట్రాఫిక్‌లో ఉన్న మనోహర్‌ను మదనపల్లి టూ టౌన్‌కు, కుప్పం ఎస్సై లోకేష్‌ను గుర్రంకొండకు, పుత్తూరులో ఉన్న హనుమంతప్పను కుప్పానికి, గుర్రంకొండలో ఉన్న నరేష్‌ను సదుంకు, మదనపల్లి వన్ టౌన్‌లో ఉన్న సుమన్‌ను ఎస్‌ఆర్ పురానికి, మదనపల్లి టూటౌన్‌లో ఉన్న పురుషోత్తంను చిత్తూరు వన్ టౌన్‌కు, వీఆర్‌లో ఉన్న రవినాయక్‌ను చిత్తూరు టూటౌన్‌కు, పుంగనూరులో ఉన్న ప్రసాద్‌ను పెనుమూరుకు, చిత్తూరుల డీటీసీలో ఉన్న గోపిని కెవిబిపురానికి , సోమలలో ఉన్న వెంకటేశ్వర్లను పుత్తూరుకు, కెవిబిపురంలో ఉన్న జి నరేషన్ చిత్తూరు ఎస్‌బికి, పూతలపట్టులో ఉన్న మల్లేష్ యాదవ్‌ను పాకాలకు అక్కడ ఉన్న సునిల్ కుమార్‌ను సదుంకు బదిలీ చేస్తూ ఆదేశించారు.