చిత్తూరు

రథసప్తమి నాడు భక్తులకు మెరుగైన సేవలందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 7: రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈనెల 12న స్వామివారి వాహన సేవలను దర్శించడానికి వచ్చే భక్తులకు భక్త్భివంతో మెరుగ్గా సేవలు అందించాలని టీటీడీ తిరుమల జేఈఓ శ్రీనివాస రాజు అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక శే్వత భవనంలో ఆయన రథసప్తమికి విధులు కేటాయించిన అధికారులతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్యాలరీల్లోని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన సేవలందించడానికి 300 మంది అధికారులకు నాలుగు మాడా వీధుల్లో విధులు కేటాయించామన్నారు. ప్రతి గ్యాలరీలో టీటీడీ సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, శ్రీవారి సేవకులు ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. భక్తులకు సమయానుకూలంగా టీ, కాఫీ, అల్పాహారం, మజ్జిగ, అన్నప్రసాదాలు, సుండల్ అందించనున్నట్లు తెలిపారు. ఆరోగ్య విభాగం సిబ్బందితో సమన్వయం చేసుకుని ఎప్పకప్పుడు చెత్తను తరలించాలని, మరుగుదొడ్లను పరిశుభంగా ఉంచాలన్నారు. తిరుమలలో ఇతరులు అన్నదానం చేయడాన్ని నిషేధించనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈలు రమేష్ రెడ్డి, వేంకటేశ్వర్లు, డీఎఫ్‌ఓ ఫణికుమార్ నాయుడు, ట్రాన్స్‌పోర్టు జీఎం శేషారెడ్డి, వీఎస్వో మనోహర్, అన్నప్రసాదం ప్రత్యేకాధికారి వేణుగోపాల్, క్యాటరింగ్ అధికారి శాస్ర్తీ ఇతర అధికారులు పాల్గొన్నారు.

తలనీలాల విక్రయం ద్వారా టీటీడీకి రూ. 11.17 కోట్లు ఆదాయం

తిరుపతి, ఫిబ్రవరి 7: కలియుగ ప్రత్యక్షదైవమైన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి భక్తులు సమర్పించిన తలనీలాలను ఈ-వేలం ద్వారా విక్రయించడంతో రూ. 11.17 కోట్లు ఆదాయం లభించింది. జేఈఓ శ్రీనివాస రాజు పర్యవేక్షణలో జరిగిన ఈ-వేలంలో 1,2,3,4,5 రకాలతో పాటు తెల్ల వెంట్రుకలు 1,43,900 కిలోల తలనీలాలు అమ్ముపోయాయి. ఇందులో మొదటి రకం తలనీలాల్లో ఏ కేటగిరిలో 200 కిలోలు అమ్ముడుపోయి రూ. 52.01 లక్షలు, బీ కేటగిరీలో 200 కిలోలు అమ్ముడుపోయి రూ. 36.66 లక్షలు ఆదాయం లభించింది. రెండో రకం ఏ కేటగిరిలో 3,100 కిలోలు అమ్ముడుపోయి రూ. 548.35 లక్షలు ఆదాయం లభించగా, బి క్యాటగిరిలో 4,300 కిలోలు అమ్ముడుపోయి రూ. 366.79 లక్షలు ఆదాయం లభించింది. మూడోరకంలో ఏ కేటగిరిలో 1000 కిలోలు అమ్ముడుపోయి రూ. 60.22 లక్షలు ఆదాయం రాగా, బి కేటగిరిలో 100 కిలోలు అమ్ముడుపోయి రూ. 4.55 లక్షలు ఆదాయం లభించింది. ఐదోరకం తలనీలాలు 1,35,000 కిలోలు అమ్ముడుపోయి రూ. 48.62 లక్షలు ఆదాయం సమకూరింది.