చిత్తూరు

శ్రీవారి సేవలో కర్ణాటక అడ్మిర్ మఠాధిపతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 7: కర్ణాటక రాష్ట్రంలోని అడ్మిర్ మఠాధిపతి విశ్వప్రియ తీర్థస్వామి తన శిష్యబృందంతో గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

భారతీయ సంస్కృతి, సంస్కృత భాష విడదీయలేనివి
* తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి వెల్లడి
తిరుపతి, ఫిబ్రవరి 7: భారతీయ సంస్కృతిని, సంస్కృత భాషను విడదీయలేమని, మన సంస్కృతిని విస్తృతం చేయాలంటే సంస్కృత భాష ఒక్కటే సరైన సాధనమని తెలంగాణ ప్రభుత్వ రాష్ట్ర సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి పేర్కొన్నారు. స్థానిక రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో జరుగుతున్న 13వ అఖిల భారతీయ సంస్కృత విద్యార్థుల ప్రతిభా మహోత్సవాలు గురువారంతో ముగిసాయి. ఈ సభకు హాజరైన ఆయన మాట్లాడుతూ విద్యార్థులు బహుమతులు పొందడం కన్నా పోటీతత్వంతో పాల్గొనాలని సూచించారు. వీసీ ఆచార్య మురళీధర శర్మ మాట్లాడుతూ సంస్కృత శాస్త్రాల పరిరక్షణకు ఏకైక మార్గం శాస్త్ర అధ్యయనం మాత్రమేనన్నారు. సంస్కృత భాషను నేర్చుకుంటే శాస్త్రాల్లోని అమూల్యమైన విషయాలను అధ్యయనం చేయవచ్చని చెప్పారు. దేశం నలుమూలల నుంచి 35 సంస్కృత విద్యాసంస్థల నుంచి వచ్చిన 370 మంది విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో విజేతలైన వారికి స్వర్ణ, రజిత, కాంస్య పతకాలను, నగదు పురస్కారాలను అందజేశారు. అత్యధిక పతకాలను విద్యాపీఠం ప్రథమ స్థానంలో వైజయంతి షీల్డ్‌ను గెలుచుకుంది. ఈకార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య జిఎస్‌ఆర్ కృష్ణమూర్తి, అకడమిక్ డీన్ రాణీసదాశివ మూర్తి, వాగ్వర్థినీ కో ఆర్డినేటర్ డాక్టర్ ఎస్.మురళీధర రావు,డాక్టర్ సోమనాథ్ దాస్, అదనపు కో ఆర్డినేటర్ డాక్టర్ సి.హెచ్.నాగరాజు తదితరులు పాల్గొన్నారు.