చిత్తూరు

సీకే బాబును పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, ఫిబ్రవరి 7 : మాజీ ఎమ్మేల్యే సీకే బాబు అలియాస్ సీకే జయచంద్రారెడ్డిని వైకాపాలో చేర్చుకునే ప్రసక్తేలేదని ఆ పార్టీ పొలిబ్యూరో సభ్యులు, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన గురువారం స్థానిక లక్ష్మీనగర్‌కాలనీలోని వైకాపా చిత్తూరు పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడారు. చిత్తూరు నియోజకవర్గం పార్టీ అభ్యర్థిని ఇంకా నిర్ణయించలేదని, అయితే మాజీ ఎమ్మెల్యే సీకే బాబుకు మాత్రం టికెట్ ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. అదే క్రమంలో ఆయన్ను పార్టీలో చేర్చుకోబోమనే విషయంగా జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 3.69 కోట్ల ఓట్లులో, 59 వేలు బోగస్‌వే అన్నారు. గత 2014 ఎన్నికల్లో తమ పార్టీ కేవలం ఒక శాతం ఓట్లు ( 5 లక్షలు) తో ఓటమి పొందిన విషయాన్ని చంద్రబాబు సర్కార్ గుర్తెరిగి దొడ్డిదారిన ఓట్ల నమోదును చేపట్టిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారులను లోబరచుకుని, వారితో భారీగా దొంగ ఓట్లను నమోదు చేయించుకుందన్నారు. తమ నాలుగు నెలల పర్యవేక్షణలో దొంగ ఓట్లుగా తేలిన 59 లక్షల్లో 30 లక్షల ఓట్లు ఆంధ్రప్రదేశ్‌లో ఉండగా, మిగిలిన 29 లక్షల పై చిలుకు ఓట్లు ఆంధ్రతోపాటు, తెలంగాణాలోనూ ఉన్నాయని వెల్లడించారు. సంబంధిత విషయాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకుపోయామన్నారు. అదే విధంగా రాజ్యాంగ నియమ నిబంధనల ప్రకారం ఎన్నికలు జరిగే ఏడాదిలో ఆయా ప్రభుత్వాల మిగిలిన పాలనా కాల వ్యవధిని మాత్రమే పరిగణలోకి తీసుకుని ఓట్ ఆన్ బడ్జెట్‌ను ప్రకటించాల్సి ఉందన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా ఏడాదికి సరిపడా పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రకటించి రాజ్యాంగ స్పూర్తికి విఘాతం కలిగించిందన్నారు. రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు 11 శాతానికి పెరిగిందని చెప్పుకుంటున్న చంద్రబాబు సర్కార్ రైతులకు చెల్లించాల్సిన రుణాలు, డ్వాక్రా సంఘాల సభ్యురాళ్ల రుణాలు ఎందుకు మాఫీ చేయాలేదని ప్రశ్నించారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేసినప్పుడు రైతులకు చెల్లించాల్సిన మొత్తం రుణమాఫీ రూ. 87,612 కోట్లు కాగా, రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్యను, రుణ బకాయిల మొత్తాలను పలు కమిటీల ద్వారా భారీగా కుదించి రూ. 24 వేల కోట్లుగా చూపారని తెలిపారు. అందులోనూ ఇప్పటి వరకు మూడు దఫాలుగా రైతులకు కేవలం 13,600 వేల కోట్లును మాత్రమే మాఫీ చేసిందని వివరించారు. అదే తరహాలో రాష్ట్రంలోని 83 వేల మంది డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేయకపోగా, తాజాగా పసుపు కుంకుమ పేరుతో స్వయం సహాయక సభ్యురాళ్లకు పోస్ట్‌డేటెడ్ చెక్కులను ఆర్భాటంగా పంపిణి చేయించి మరోసారి ఏమార్చుతున్నారని మండిపడ్దారు. సంబంధిత పసుపు కుంకుమ పథకానికి ఇస్తున్న పోస్ట్‌డేటెడ్ చెక్కులకు సరిపడా నగదును సబ్ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల నుంచి హోదా విషయంగా చంద్రబాబు సర్కార్ చేస్తున్న ధర్మపోరాట దీక్షలకు సర్వ శిక్షా అభయాన్ నిధులను వినియోగించుకునేలా ఆయా శాఖల రాష్ట్ర ముఖ్య కార్యదర్శులకు ఆదేశాలు పంపడం దారుణమన్నారు. ఈ విషయాన్ని కంప్రోట్రలర్ అండ్ ఆడిటర్ జనరల్ ( కాగ్ ) సుప్రీంకోర్టు దృష్టికి తీసుకుపోగా, కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పడుతూ అక్షింతలు వేసినా మార్పు రాకపోవడం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈబీసీలకు మంజూరు చేసిన 10 శాతం రిజర్వేషన్లలో ఏ రాజ్యాంగ సవరణ లేకుండా కాపులకు 5 శాతం ఎలా కేటాయిస్తారో చంద్రబాబు సర్కార్ కాపులకు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఇసుక, మట్టి, నీరు-చెట్టు పథకాలతో పాటు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జరుగుతున్న అవినీతిని కప్పి పుచ్చుకునేందుకే చంద్రబాబునాయుడు జాతీయ దర్యాప్తు సంస్థలను రాష్ట్రంలో అడుగు పెట్టకుండా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకోవడంతో పాటు, వారిలో కొందరికి మంత్రి పదువులను కట్టబెట్టడంతోనే రాష్ట్రంలో స్పీకర్, గవర్నర్‌ల వ్యవస్థ ఎంత మేరకు భ్రష్ఠు పట్టిందో తెలిసిపోతుందన్నారు. రాష్ట్రంలో పాలన చేతగాని చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసమే మరో సారి కొత్త నాటకానికి తెరతీస్తూ కేంద్రంలో మరో ఫ్రంట్ ఏర్పాటు చేస్తామంటూ తిరుగుతున్నారని ఆరోపించారు. కాగా ఈ సమావేశంలో పార్టీ చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షులు జంగాలపల్లి శ్రీనివాసులు, నగర అధ్యక్షులు చంద్రశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి పురుషోత్తంరెడ్డి, ఎస్సీ విభాగం అధ్యక్షులు శేఖర్, న్యాయ విభాగం ప్రతినిధి రఘురామ్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్భ్రావృద్ధికి బాబు యజ్ఞం చేస్తుంటే
రాక్షసుడిలా అడ్డుపడుతున్న జగన్
* తుడా చైర్మన్ నరసింహ యాదవ్ ధ్వజం
తిరుపతి, ఫిబ్రవరి 7: ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహాయజ్ఞం చేస్తుంటే దానిని అడుగడుగునా అడ్డుకునేందుకు రాక్షసుడిలా వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అడ్డుపడుతున్నారని తుడా చైర్మన్ నరసింహ యాదవ్ ఆరోపించారు. తుడా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ శంఖారావంలో చెప్పినవన్నీ అబద్దాలేనని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో ఓటమి పాలైతే తన బతుకు శ్రీకృష్ణ జన్మస్థానం, పార్టీ పరిస్థితి కుక్కలు చించిన విస్తరి అవుతుందనే భయం స్పష్టంగా కనిపించిందన్నారు. అందుకే ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అవసరమైన కూడు, గూడు, గుడ్డ కల్పించడానికే తెలుగుదేశం పార్టీని దివంగత ఎన్.టి.రామారావు ఏర్పాటు చేశారన్నారు. ఆయన లక్ష్యసాధనలో నిరంతరం ముందుకు వెళుతున్న సమయంలో రాష్ట్ర విభజన పిడుగులాంటి చర్య అన్నారు. అదే సమయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మిత్రద్రోహానికి పాల్పడి రాష్ట్భ్రావృద్ధికి సహకరించక పోవడం దారుణమన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రతిపక్ష నేత జగన్‌కు తాను ముఖ్యమంత్రి కావాలన్న ఆశ తప్ప ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన లేదన్నారు. అందుకే నవ రత్నాలంటూ ఆచరణ సాధ్యంకాని హామీలిస్తున్నారని ఆయన విమర్శించారు. రైతులకు రుణ మాఫీ సాధ్యం కాదన్న ప్రతిపక్ష నేత నేడు రైతుల సంక్షేమ గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో టీడీపీ నాయకులు గుణశేఖర్ నాయుడు, దేవ పాల్గొన్నారు.