చిత్తూరు

ముగిసిన గోవిందరాజ స్వామి తెప్పోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 19: శ్రీ గోవిందరాజ స్వామివారి పుష్కరిణిలో గత ఏడు రోజులుగా జరుగుతున్న స్వామివారి తెప్పోత్సవాలు మంగళవారం వేడుకగా ముగిసాయి. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు ఉభయ దేవేరులతో కలిసి స్వామివారు తెప్పలపై విహరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈఓ వరలక్ష్మి, ఏఈఓ ఉదయ భాస్కర్ రెడ్డి, సూపరింటెండెంట్ శ్రీహరి, టెంపుల్ ఇన్స్‌పెక్టర్ కృష్ణమూర్తి ఇతర అధికారులు పాల్గొన్నారు.

తిరుమలలో ఘనంగా కుమారధార ముక్కోటి
తిరుపతి, ఫిబ్రవరి 19: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి వాయువ్యదిశలో ఉన్న శ్రీ కుమారధార తీర్థ ముక్కోటి మంగళవారం ఘనంగా జరిగింది. కుంభ మాసంలో ముఖానక్షత్రయుక్త పూర్ణిమ నాడు కుమారధార తీర్థ ముక్కోటిని నిర్వహించడం ఆనవాయితీ. ఈ పర్వదినాన ప్రకృతి సౌందర్యాల నడుమ నిర్వహించే కుమారధార తీర్థ ముక్కోటిని దర్శించి, స్నానమాచరించడం భక్తులకు ఒక ప్రత్యేక అనుభూతిగా భావిస్తారు.

టీటీడీ బిల్డింగ్ ముట్టడికి యత్నించిన సీఐటీయూ నేతల అరెస్ట్
తిరుపతి, ఫిబ్రవరి 19: టీటీడీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల జీతాలను పెంచాలని డిమాండ్ చేస్తూ మంగళవారం టీటీడీ పరిపాలనా భవనం ముట్టడించేందుకు ప్రయత్నించిన దాదాపు 60 మంది సీఐటీయూ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. టీటీడీ పరిపాలనా భవనం ముట్టడికి వందల సంఖ్యలో కార్మికులు ఎర్ర జెండాలను చేతపట్టుకుని అక్కడకు చేరుకున్నారు. అదే సమయంలో పోలీసులు సైతం భారీగా మోహరించారు. నాయకుల ప్రసంగాల తరువాత కార్మికులు భవనంలోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో అప్పటికే సిద్ధంగా ఉన్న పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌ను తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడిచిపెట్టారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పుల్లయ్య, సిఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి, రాష్ట్ర నారుూబ్రాహ్మణ చైర్మన్ వందాడి వెంకటేశ్వర్లు, ఆలిండియా బీసీ ఫెడరేషన్ జాతీయ నాయకులు ఆల్మెన్ రాజు, నాయకులు టి.సుబ్రహ్మణ్యం, చంద్రశేఖర్ రెడ్డి, నారాయణ బాబు, లక్ష్మీ, బుజ్జి, కాంగ్రెస్ నాయకుడు డిఎంసీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీవారికి రూ. 2లక్షల విలువైన సిమెంట్ విరాళం
తిరుపతి, ఫిబ్రవరి 19: కేసీపీ గ్రూప్ సిమెంట్ తయారీ సంస్థ కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ప్లాంట్ యూనిట్-2లో నూతనంగా విడుదల చేసిన తమ మొదటి ఉత్పత్తి 540 సిమెంట్ బస్తాలను విరాళంగా అందించింది. స్థానిక డిపిడబ్ల్యు స్టోర్స్‌లో మంగళవారం ఉదయం ఆ సంస్థ సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ దేవేందర్ రెడ్డి రూ. 2లక్షల విలువచేసే సిమెంట్ బస్తాలను ఈఈ కృష్ణా రెడ్డికి అందజేశారు. ఈకార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈఈ మురళీ కృష్ణా రెడ్డి, ఏఈ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.