చిత్తూరు

రాయలసీమ రైతు సమస్యలు తీర్చడానికే హంద్రీ-నీవా జలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపంజాణి, ఫిబ్రవరి 18: రాయలసీమ రైతుల సమస్యలు తీర్చడానికే హంద్రీ-నీవా జలాలు తీసుకువచ్చామని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి అన్నారు. మంగళవారం చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం అప్పినపల్లె గ్రామం వద్ద పుంగనూరు బ్రాంచ్ కెనాల్ నుంచి కుప్పం బ్రాంచ్ కాలువకు కృష్ణా జలాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 30 ఏళ్ల నుంచి రాయలసీమ రైతాంగం ఎదురు చూస్తున్న హంద్రీ-నీవా జలాలు కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి చిత్తూరు జిల్లాలోని కుప్పానికి త్వరలో చేరుతాయన్నారు. గత 30 ఏళ్ల క్రితం దివంగత ఎన్టీ రామారావు మొదటిసారిగా కర్నూలులో ఉన్న హంద్రీ, చిత్తూరులో ఉన్న నీవాను కలిపి హంద్రీ-నీవాగా నామకరణం చేశారని, ఆయన అంతరంగీకుడు శ్రీరామకృష్ణయ్య ద్వారా సర్వే చేయించి అప్పుడు కాలువ నిర్వహణ పనుల కోసం ఏర్పాట్లు చేశారని తెలిపారు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కలను నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పూర్తి చేశారని మంత్రి పేర్కొన్నారు. దేశ ప్రధాని నరేంద్రమోదీ గంగా, కావేరిలను అనుసంధానం చేస్తానంటూ ఐదేళ్ల క్రితం చెప్పారని, ఇంత వరకు చేయలేదన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని నదుల ఆనుసంధానం పనిని మన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృష్ణ, గోదావరిలను ఆనుసంధానం చేసి చూపించారరు. ఇలాంటి గొప్ప వ్యక్తి చరిత్రలో నిలిచిపోతారని తెలిపారు. సుమారు 560 కిలోమీటర్ల దూరంలో ఉన్న హంద్రీ-నీవా పనులను గత ప్రభుత్వం కాలువలు తవ్వి వదిలేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు పనులన్ని పూర్తిచేశారని, ప్రస్తుతం హంద్రీ-నీవా జలాల కారణంగా దేశంలో ఉద్యాన వన పంటలు పండించడంలో మొదటిస్థానంలో ఉందని తెలిపారు. ఎన్నికల కంటే ముందుగానే కృష్ణా జలాలను జిల్లాకు తీసుకొస్తామని చెప్పిన మాట ప్రకారంగా ఈ నెలాఖరుకు కుప్పానికి నీళ్లిచ్చిన ఘనత చంద్రబాబుదే అని తెలిపారు. గతంలో వ్యవసాయానికి 7గంటలు ఇస్తున్న విద్యుత్ ఇప్పుడు 9 గంటలు ఇస్తామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు డ్రిప్ పరికరాలు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎస్‌ఎస్ సీఈ మురళీధర్‌రెడ్డి, ఎస్‌ఈ వెంకటేశ్వరరావు, జనవనరుల శాఖ అధికారులు, ఎంపీడీవో శ్రీనివాసులు, పలమనేరు మాజీ ఎమ్మెల్యే లలితకుమారి, జడ్పీటీసీ సులోచన, ఎంపీపీ మురళీ తదితరులు పాల్గొన్నారు.