చిత్తూరు

28న ఎన్నికల పాఠశాల కార్యక్రమం నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, ఫిబ్రవరి 26: జిల్లాలో రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటరును చైతన్య పరచడానికి ఈనెల 28వ తేదీన ప్రతి పోలింగ్ కేంద్రంలో (టూనోవ్)) ఎన్నికల పాఠశాల కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్ ప్రద్యుమ్న నోడల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎన్నికల ముందస్తు ఏర్పాట్లపై జిల్లా సచివాలయంలో నోడల్ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈసందర్భంగా (టూనోవ్) కార్యక్రమం వల్ల ప్రతి పోలింగ్ కేంద్రాల వద్ద బీఎల్‌వోల పనితీరు, వీవీ ప్యాట్ నిర్వహణ తదితర అంశాలను ప్రజలకు వివరించే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈవిధంగా అవగాహన కల్పిస్తే రానున్న రోజుల్లో ప్రజల్లో చైతన్యం వచ్చి పోలింగ్‌శాతం పెరిగే అవకాశం ఉందన్నారు. ఇంతే కాకుండా ఈవీఎంలపై అనుమానాలను ఈకార్యక్రమంలో నివృత్తి చేసుకునే అవకాశం ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా 3800 పోలింగ్ కేంద్రాల్లో విధిగా ఈనెల 28వ తేదీన ఈకార్యక్రమం కొనసాగాలన్నారు. ఇందుకోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈకార్యక్రమంలో జేసీ గిరీష, డీఆర్‌వో గంగాధరగౌడు, పలువురు నోడల్ అధికారులు పాల్గొన్నారు.

రౌడీ రాజకీయాలు చేస్తే సహించబోం
* ఎమ్మెల్సీ రాజసింహులు హెచ్చరిక
చిత్తూరు, ఫిబ్రవరి 26 : ఓట్ల కోసమో, స్వప్రయోజనాల కోసమే రౌడీ రాజకీయాలు చేస్తే సహించబోమని ఎమ్మెల్సీ రాజసింహులు హెచ్చరించారు. మంగళవారం టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు స్థానిక జిల్లా టీడీపీ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని వైకాపా ప్రజాప్రతినిధులు స్వలాభం కోసం అభం శుభం ఎరుగని ఓటర్లను బలి పశువులను చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తన అనుచరగణంతో నియోజకవర్గంలో కులాల కుంపటిని రగిలించడంతో పాటు, అను నిత్యం అల్లర్లు చేస్తున్నారని పేర్కొన్నారు. చంద్రగిరి నియోజవర్గంలో ఈసారి కూడా ఏదోలా విజయం సాధించాలనే ఉద్దేశ్యంతో పెద్దఎత్తున దొంగ ఓట్లను నమోదు చేయించిన ఎమ్మెల్యే ఈ విషయాన్ని ప్రశ్నించిన టీడీపీ సానుభూతిపరులపై భౌతిక దాడులకు పాల్పడుతూ భయోత్పాతం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంలో దోషులను అరెస్ట్ చేస్తే పోలీసులపైన కూడా దౌర్జన్యం చేసే పనిలో నిమగ్నమవడం తగదన్నారు. రెండేళ్లుగా అసెంబ్లీకి వెళ్లకుండా జీత భత్యాలు తీసుకుంటున్న వారికి ప్రజా సమస్యలు పట్టవని చెవిరెడ్డి ఉదంతమే చెబుతోందన్నారు. మేయర్ కఠారి హేమలత మాట్లాడుతూ టీడీపీ పారదర్శకమైన పార్టీ అని, ప్రతి ప్రభుత్వ సంక్షేమ పథకం కూడా ఆన్‌లైన్ విధానంలోనే చేపడుతూ అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటోందన్నారు. అయితే ఈ విధానాన్ని మింగుడు పడలేకనే వైకాపా నాయకులు అనవసర రాద్దాంతం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఇందులో భాగంగానే ఇటీవల చంద్రగిరిలో నిర్వహించిన డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ పంపిణి, పెంచిన పింఛన్ల పంపిణి కార్యక్రమాలను అడ్డుకున్నారని ఆరోపించారు. వైకాపా నాయకులు తీరును ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో అదే ప్రజలు వైకాపాకు తగు రీతిలో బుద్ది చెప్పడం ఖాయమన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ దుర్గ, టీడీపీ నాయకులు చంద్రప్రకాష్, సురేంద్రకుమార్, కఠారి ప్రవీణ్, సీఎం విజయ తదితరులు పాల్గొన్నారు.