చిత్తూరు

ఉగ్రవాద శిబిరాలపై వాయుసేన దాడులతో బీజేపీ నేతల సంబరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 26: భారత సరిహద్దుల్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన దాడులు చేసి నిర్వీర్యం చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ తిరుపతి నాలుగుకాళ్ల మండపం వద్ద బీజేపీ నాయకులు మంగళవారం టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. జాతీయ జెండాలను చేతపట్టుకుని జయహో భారత్, జయహో వాయుసేన, ప్రధాని మోదీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు అనేక దశాబ్దాలుగా ఎంతో మంది భారత సైనికులు, ప్రజల ప్రాణాలను తీస్తూ రెచ్చిపోయారన్నారు. మన దేశం ఎంతో సహనంతో ఉన్నా ఉగ్రవాదులు రెచ్చిపోతూ అనేక అకృత్యాలకు పాల్పడ్డారని తెలిపారు. ఇందులో భాగంగానే పుల్వామాలో 40 మంది సైనికులను మానవ బాంబును ప్రయోగించి పొట్టున పెట్టుకున్నారన్నారు. దీనిని యావత్ భారతదేశ ప్రజలు నిరసించినా పాక్ మాత్రం సమర్థించుకోవడం దారుణమన్నారు. దీనికి ప్రతిగా ప్రధాని మోదీ ఆదేశాలతో వాయు సేన ఉగ్రశిబిరాలపై దాడి చేసి తన సత్తా చాటిందన్నారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్ మాట్లాడుతూ యావత్ దేశ ప్రజలు నేడు గర్వించదగ్గ రోజని అన్నారు. ఇప్పటికైనా పాక్ తన తీరు మార్చుకుని ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడం మానుకోవాలని హెచ్చరించారు. లేకుంటే భారత్ ఆగ్రహాన్ని చవి చూడక తప్పదన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ముని సుబ్రహ్మణ్యం, కొత్తపల్లి అజయ్ కుమార్‌లు మాట్లాడుతూ ప్రపంచశాంతిని కోరుకోవడం, సహనంతో ఉండటం భారత్ లక్ష్యమని, దానిని అసమర్థగా భావిస్తే నేటి వాయు సేన దాడులు మరిన్ని జరిగే అవకాశం ఉందని గుర్తించాలన్నారు. బీజేపీ జిల్లా ప్రచార కార్యదర్శి గుండాల గోపీనాథ రెడ్డి మాట్లాడుతూ భారతీయుల ఆగ్రహాన్ని వాయుసేన చేతల్లో చేసి చూపించిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నగర అధ్యక్షుడు వరప్రసాద్, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కట్టమంచి చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎమ్మార్ రాజా, నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్, మోహన్, జీవన్ రాయల్ తదితరులు పాల్గొన్నారు.