చిత్తూరు

నేటి నుంచి ఇంటర్ పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, ఫిబ్రవరి 26: జిల్లాలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాటు పూర్తిచేశారు. ఈ పరీక్షల నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా 133 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమై వచ్చెనెల 18వ తేదీ వరకు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. బుధవారం ఇంటర్ ప్రథమ సంవత్సరం గురువారం నుంచి ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఈ పరీక్షలు జరగనున్నాయి, ఇంటర్ ప్రథమ సంవత్సర జనరల్ విద్యార్థులు 49.474మంది, ఓకేషనల్ విద్యార్థులు 3.501మంది , ద్వితీయ సంవత్సరం జనరల్ విద్యార్థులు 50.941 మంది, ఒకేషనల్ విద్యార్థులు 3.801మంది పరీక్షలు రాయనున్నారు. విద్యార్థులు అర్ధగంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని ఆధికారులు సూచించారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ విధించారు. ప్రతి చోట సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షల నిర్వహణ కోసం 133మంది చీఫ్ సూపరింటెండెంట్ అఫీసర్లు, మరో 133మంది డిపార్టుమెంట్ ఆఫీసర్లను నియమించారు. జిల్లాలో ఈ పరీక్షలు ప్రశాంతంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేసామని, ఎక్కడా మాస్ కాపీంగ్‌కు ఆస్కారం లేకుండా జిల్లాలో నాలుగు ప్లైయింగ్ స్క్వాడ్లను, 14 సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసినట్లు ఇంటర్ ఆర్‌ఐవో కృష్ణయ్య తెలిపారు. నిర్ణీత సమయానికి కన్నా నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించడం జరగదని పేర్కొన్నారు. ఈ పరీక్షల సంబంధించి ఏవైనా సమస్యలున్నా, ఫిర్యాదులు చేయాలన్నా తిరుపతి కేంద్రంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. పరీక్షలకు సంబంధించి ఫిర్యాదులను 0877-2237200కు ఫోన్ ద్వారా తెలపవచ్చునని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 12 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించామని, వీటిపై నిత్యం నిఘా ఉంచుతున్నట్లు తెలిపారు. విద్యార్థులు పరీక్షలు రాయడానికి కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించారన్నారు.అన్ని పరీక్షా కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

టెన్త్ పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
* అన్ని కేంద్రాల్లో వౌలిక వసతులు కల్పించాలి * జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ఆదేశం

చిత్తూరు, ఫిబ్రవరి 26: జిల్లాలో మార్చి 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం పరీక్ష నిర్వహణపై జిల్లా సచివాలయంలో విద్య, వైద్య, రవాణా తదితర శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వరకు జరిగే పరీక్షలు ప్రశాంతంగా జరిగే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని విద్యార్థులకు పదోతరగతి పరీక్షలే కీలకం కానున్న నేపథ్యలో ఈ పరీక్షల్లో ఎలాంటి మాస్ కాపీయింగ్ లేకుండా ముందస్తు చర్యలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో విధిగా విద్యుత్, డెస్క్‌లు, తాగునీటి సదుపాయం, మరుగుదొడ్లు ఉండాలన్నారు. అలాగే పలు సమస్యాత్మక కేంద్రాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు కఠినంగా ఉంచాలన్నారు. విద్యార్థులను సకాలంలో పరీక్షా కేంద్రాలకు తరలించేందుకు ఆర్టీసీ అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా విద్యాశాఖాధికారి పాండురంగస్వామి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 27,457 మంది బాలురు 25567మంది బాలికలు ఈ పరక్షలకు హాజరు కానున్నారని, ఇందుకోసం 261 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. పరీక్షల్లో ఎక్కడ మాస్ కాపీయింగ్ చోటు లేకుండా 14 ఫ్లైయింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ విధించినట్లు తెలిపారు. ఇన్విజిలేటర్లు ఇతర సిబ్బందిని కూడా నియమించామని ఈ పరీక్ష నిర్వహణపై దశల వారీగా అధికారులతో సమీక్షిస్తున్నామన్నారు. ఇందుకోసం పలువురికి ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఈ సమావేశంలో డీఆర్‌వో గంగాధరగౌడు, పలువురు విద్యాశాఖ, వైద్య, రవాణాశాఖాధికారులు పాల్గొన్నారు.

పోలీసుల తీరుపై న్యాయ పోరాటం చేస్తాం
* చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్పష్టం
చిత్తూరు, ఫిబ్రవరి 26 : పోలీసులు వైకాపా నాయకులు, కార్యకర్తల పట్ల వ్యవహరిస్తున్న తీరు పట్ల న్యాయ పోరాటం చేస్తామని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఉదయం స్థానిక జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని పాకాల, ఎర్రావారిపాళెంకు చెందిన తన అనుచరులు, వైకాపా నాయకులను పరామర్శించారు. అనంతరం ఆయన జిల్లా జైలు ఎదుట విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్ర అధికార టీడీపీతో పోలీసు వ్యవస్థ కుమ్మక్కైయిందని ఆరోపించారు. ఇందులో భాగంగానే తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు ఆరోపణలు, కేసులు బనాయిస్తూ మానసిక వేదనకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ఎస్సీ సైతం అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీ నాయకులు చెప్పిన విధంగా ఆడుతూ తమ పార్టీ నాయకులను పథకం ప్రకారం అరెస్ట్‌లు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ఇలాంటి వాటికి తాను గాని, తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు బెదిరిపోరని, ఈ విషయంలో న్యాయపోరాటం చేస్తామని వివరించారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తీరుపై రాష్ట్ర, కేంద్ర ఎన్నికల కమిషన్లకు ఫిర్యాదు చేస్తామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఈనెల 24వ తేదీన చిత్తూరులోని పోలీసు ట్రైనింగ్ సెంటర్ ఎదుట చేసిన ఆందోళనకు అరెస్ట్ కాబడ్డ ఎమ్మెల్యే 41 నోటీసు కింద విడుదలయ్యారు. కాగా విలేఖరుల సమావేశంలో పలువురు వైకాపా సీనియర్ నాయకులు పాల్గొన్నారు.