చిత్తూరు

సీజనల్ వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 26: సీజనల్ వ్యాధులు, మలేరియా, డెంగీ, స్వైన్‌ఫ్లూ నివారణ చర్యలు తీసుకోవడంతోపాటుగా ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమం ప్రత్యేక ముఖ్య కార్యదర్శి డాక్టర్ పూనమ్ మాలకొండయ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం స్విమ్స్‌లో చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు జిల్లాలకు చెందిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులు, జిల్లా వైద్యశాలల సమన్వయాధికారులు, టీచింగ్ హాస్పిటల్ సూపరింటెండెంట్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామస్థాయి ఆచరణాత్మక ప్రణాళికతోపాటుగా ప్రతి ఇల్లు పరిశీలించడం, ఆక్టివ్, పాసివ్ సర్వేలెన్స్ చేయడం, హాట్ స్పాట్‌లను గుర్తించి నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. దోమలు, లార్వాల నివారణకు స్ప్రేయింగ్ చేయడం, హైరిస్క్ ప్రాంతాల్లో దోమతెరలను సరఫరా చేయాలన్నారు. ప్రతి ఇంటిలో డ్రై డేను పాటించేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లో ఆరోగ్య అవగాహన సదస్సులు, వైద్యశిబిరాలను ఏర్పాటు చేయాలని, సురక్షిత తాగునీరు సౌకర్యం కల్పించాలన్నారు. ప్రతి అస్పత్రిలో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసి మెరుగైన సేవలు అందించాలని చెప్పారు. ప్రధానంగా మాతాశిశు మరణాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు గురించి పూనం మాలకొండయ్య స్పష్టం చేశారు. చంద్రన్న సంచార చికిత్స వాహనంలో ప్రతి గర్భిణికి రక్త పరీక్షలతోపాటు ఈసీజీ పరీక్షలు చేయాలన్నారు. ప్రతి గర్భిణికి ఒక ఆరోగ్య సిబ్బందిని కేటాయించి సురక్షిత కాన్పులు జరిగేలా చూడాలన్నారు. ఆస్పత్రుల్లో సేవలను మరింత బలోపేతం చేయడానికి కొత్తగా చేరిన వైద్యాధికారులకు ఈనెల 28వ తేదీ నుంచి శిక్షణా కార్యక్రమాలను చేపట్టాలని ఆమె ఆదేశించారు. కరపత్రాల ద్వారా వడదెబ్బ నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి ఈఐ కేంద్రం సేవలు పెరగాలని, ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల్లో ఓపీ సేవలు, గర్భిణులకు మెరుగైన సేవలందించాలని స్పష్టం చేశారు. బాల సురక్ష కార్యక్రమంలో భాగంగా చిన్నారులందరికి వైద్య పరీక్షలు నిర్వహించి సేవలు అందించాలన్నారు. ప్రతి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్‌లో 30 సంవత్సరాలు నిండిన స్ర్తి, పురుషులకు మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు, థైరాయిడ్, క్యాన్సర్ జబ్బుల పరీక్షలు నిర్వహంచి వాటి నివారణకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని స్పష్టం చేశారు. ఆరోగ్యవంతమైన సమాజం కోసం అందరూ కృషి చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో హెల్త్ విభాగం డైరెక్టర్ డాక్టర్ అరుణ కుమారి, ఎన్‌టిఆర్ వైద్య సేవ సీఈఓ డాక్టర్ సుబ్బారావు, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ బాబ్జి, వైద్యవిధాన పరిషత్ కమిషన్ డాక్టర్ దుర్గా ప్రసాదరావు, అడిషినల్ డైరెక్టర్లు డాక్టర్ గీతాప్రసాధిని, డాక్టర్ నీరదా, డాక్టర్ సావిత్రి, జాయింట్ డైరెక్టర్స్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ రామారావు, డాక్టర్ దేవీలాలం, జాయింట్ కమిషనర్ డాక్టర్ జయచంద్రా రెడ్డి, వాసుదేవ రావు తదితరులు పాల్గొన్నారు.

స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు, పరదాలు వితరణ
* నేటి నుండి శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 26: శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో బుధవారం నుండి 13రోజుల పాటు జరుగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో స్వామి అమ్మవార్లను అలంకరించేందుకు పట్టువస్త్రాలను మదనపల్లికి చెందిన రాటకొండ గురుప్రసాద్ దంపతులు ఆలయ ఈఓ శ్రీరామరామస్వామికి మంగళవారం అందజేశారు. అదే విధంగా స్వామి అమ్మవార్ల చరిత్రతో పాటు ఆలయ ప్రాశస్త్యాన్ని దశదిశలా వ్యాప్తి చేసిన ప్రచారకర్తలైన 63మంది నైనారులకు శాఫ్ మాజీ చైర్మన్ పీఆర్ మోహన్ వస్త్రాలను ఈఓ శ్రీరామరామస్వామికి అందించారు. అలాగే తిరుపతికి చెందిన మణి అనే భక్తుడు స్వామి అమ్మవార్ల మూలవిరాట్ల గర్భాలయాలకు అలంకరించే పరదాలను విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ కోలా ఆనంద్, ఆలయ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.