చిత్తూరు

పంట సంజీవి ఫారంపాండ్ల నిర్మాణానికి కృషి చేయాలి: మంత్రి బొజ్జల ఆదేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, డిసెంబర్ 26: జిల్లాలో మార్చి మాసంలోపు లక్ష పంట సంజీవిని పారంపాండ్లు నిర్మించేందుకు అధికారులు చిత్తశుద్దితో కృషి చేయాలని రాష్ట్ర అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ సిద్దార్థజైన్ అధ్యక్షతన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, వివిధ శాఖల అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో అమలు చేస్తున్న వివిధ పథకాల ప్రగతిని కలెక్టర్ మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పంటసంజీవని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. నీరు-చెట్టు కార్యక్రమం జిల్లాలో నిరంతరంగా కొనసాగుతుందన్నారు. పశ్చిమ ప్రాంతాల్లో ఫీడర్ చానల్స్, కొత్త చెక్ డ్యాంలు నిర్మించాలని, అవసరమైన వాటికి మరమ్మతులు చేపట్టాలని సూచించారు. క్రిస్మస్ కానుక పంపిణీపై డిఎస్‌ఓ నుండి వివరాలు సేకరించారు. రానున్న సంక్రాంతికి ప్రభుత్వం ఇచ్చే సంక్రాంతి కానుకను లబ్ధిదారులకు సక్రమంగా అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీని పటిష్టంగా అమలు చేయాలన్నారు. లేబర్ కాంపోనెంట్ పెరిగితే ఆ మేరకు మెటిరీయల్ కాంపోనెంట్ కూడా పెరుగుతుందని, ఈ మేరకు చర్యలు చేపట్టాలన్నారు. గంగినేని, కాజురు చెరువుల్లో చోటు చేసుకున్న అక్రమాలను గుర్తించి తొలగించాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. ఈసమావేశంలో ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, చిత్తూరు, సత్యవేడు, తిరుపతి ఎమ్మెల్యేలు సత్యప్రభ, తలారి ఆదిత్య, సుగుణమ్మ, జిల్లా కలెక్టర్ సిద్దార్థజైన్, జెసి భరత్‌గుప్తా, జెసి 2 వెంకటసుబ్బారెడ్డి, డిఆర్‌ఓ విజయ్‌చందర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

శ్రీ కపిలేశ్వరాలయంలో ఘనంగా ఆరుద్ర దర్శన మహోత్సవం

తిరుపతి, డిసెంబర్ 26 : తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శనివారం ఆరుద్రదర్శన మహోత్సవం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా తెల్లవారుజామున 2 గంటల నుండి 4 గంటల వరకు మహన్యాస ఏకాదశి రుద్రాభిషేకం ఏకాంతంగా నిర్వహించారు. ధనుర్మాస నైవేద్యం సమర్పించిన అనంతరం ఉదయం 5.30 గంటల నుండి 9.30 గంటల వరకు శ్రీ శివగామి సమేత నటరాజ స్వామివారు, శ్రీ మాణిక్యవాసగర్ స్వామివార్లను పురవీధుల్లో ఊరేగించారు. సాయంత్రం శాస్త్రోక్తంగా దీపారాధన చేపట్టారు. ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి బాలాజి, ఇతర ఆలయ అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.