చిత్తూరు

జిల్లాలోని 37మండలాల్లో మోస్తరు వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, మే 17: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా జిల్లాలో ఓ మోస్తారు వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా 6.7 మి.మీ సరాసరి వర్షపాతం నమోదైంది. అత్యధికంగా సత్యవేడులో 45.6మి.మీ వర్షం కురిసింది. పలుచోట్ల ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురియడంతో పాక్షికంగా మామిడి, అరటి, పంటలకు నష్టం వాటిల్లింది. అయితే వేసవి ఉక్క పోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న జిల్లా వాసులకు ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించింది. తూర్పు మండలాల్లోని అత్యధికంగా వర్షపాతం నమోదైంది. కొన్ని చోట్ల ఈదురు గాలులు కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఆరుతడి పంటలకు ఈ వర్షం కొంత వరకు లాభాన్ని చేకూర్చింది. జిల్లా వ్యాప్తంగా కురిసిన ఓ మోస్తారు వర్షంతో వాతావరణంలో మార్పు చోటుచేసుకుంది. నారాయణవనంలో 15.4, తొట్టంబేడులో 10.4, బిఎన్ కండిగ 42.4, వరదయ్యపాళ్యం 38, పిచ్చాటూరు 35, నాగలాపురం 22, నిండ్ర 26, తవణంపల్లె 44.4, ఎస్ ఆర్‌పురం 10, పాలసముద్రం 10.2, నగరి 17, చిత్తూరు 11, శ్రీకాళహస్తి 10.2, తిరుపతి 6.6వర్షపాతం నమోదైంది. అయితే ఈ వర్షం కేవలం తూర్పు మండలాల్లో పరిమితం కాగా పడమటి మండలాల్లో మాత్రం మబ్బులతో కూడిన చిరుజల్లులు కురిసాయి. దీంతో గత పది రోజులుగా ఉష్ణ తాపానికి గురవుతున్న జిల్లా వాసులకు ఈ వర్షం కొంత ఊరటనిచ్చింది. మదనపల్లె, చిత్తూరు డివిజన్‌లో తక్కువ వర్షపాతం నమోదు కాగా తిరుపతి డివిజన్‌లో ఈ వర్షం ఎక్కువ మోతాదులో కురిసింది. దీంతో ఈ ప్రాంతంలో ఖరీప్ పనులు చేయడానికి రైతాంగం సన్నద్దమైంది.