చిత్తూరు

తిరుమలలో పెరిగిన రద్దీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, మే 17: తిరుమల్లో మంగళవారం భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. తమిళనాడులో సార్వత్రిక ఎన్నికలు ముగియడం అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ పరీక్షలు ముగిసిన నేపథ్యంలో ఈరెండు రాష్ట్రాల నుంచి శ్రీవారి దర్శనార్థం భక్తులు పోటెత్తారు. దీంతో శ్రీవారిని దర్శించుకునేందుకు గంటల తరబడి భక్తులు క్యూలైన్లలో వేచివుండే పరిస్థితి ఏర్పడింది. శ్రీవారి దర్శనార్థం వేచివున్న భక్తులతో వైకుంఠం-1,2 క్యూకాంప్లెక్స్‌లు నిండిపోయి సుమారు కిలోమీటరు మేర వెలుపలికి క్యూలైన్లు ఉన్నాయి. ఇక మంగళవారం సాయంత్రం 6గంటలకు అందిన సమాచారం మేరకు ఉచిత క్యూలైన్లో వెళ్లి స్వామివారిని దర్శించుకునే భక్తులకు 12గంటల సమయం పడుతుండగా, కాలినడకన వచ్చే భక్తులకు కల్పించే దివ్యదర్శనానికి 8గంటల సమయం పడుతోంది. మంగళవారం తెల్లవారుజామున 3గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు 54,736మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. భక్తులు హండీలో సమర్పించిన కానుకల ద్వారా రూ.2.32 కోట్లు ఆదాయం లభించింది. ఇలా ఉండగా తెల్లవారు జామునుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షంలో తడుచుకుంటూనే క్యూలైన్లలో వెడుతూ శ్రీవారిని దర్శించుకుంటున్నారు. గదులు దొరకని భక్తులు యాత్రి సదన్‌లో షెడ్స్ కింద తలదాచుకుంటున్నారు.