చిత్తూరు

డ్రైడే పాటించేలా చూడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, మే 23 : వచ్చే నెల నుంచి వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉన్నందున దోమలు వ్యాప్తి చెందకుండా చేసే చర్యల్లో భాగంగా ప్రజలు వారానికో రోజు డ్రైడే పాటించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి (డిఎం అండ్ హెచ్‌ఓ ) డాక్టర్ కోటేశ్వరి ఆదేశించారు. ఈ మేరకు గురువారం స్థానిక డిఎం అండ్ హెచ్‌ఓ కార్యాలయంలో ఎంపిహెచ్‌ఓ, సిహెచ్‌ఓలతో ఆమె సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎం అండ్ హెచ్‌ఓ మాట్లాడుతూ నీటిలో దోమల లార్వా వృద్ధి చెందే విషయాన్ని ఆరోగ్య కార్యకర్తలు ప్రజలకు ప్రయోగాత్మకంగా చూపి వివరించాలన్నారు. అదే క్రమంలో వారానికోరోజు ప్రజలు తమ ఇళ్లలోని నీటిని పూర్తిగా తీసి వేసి 24 గంటల పాటు పాత్రలు, నీటి తొట్టెలను ఆరబెట్టి డ్రైడే పాటించేలా చూడాలన్నారు. 35ఏళ్లునిండిన స్ర్తిలలో క్యాన్సర్ లక్షణాల ఉన్న వారిని జిల్లాలోని మదనపల్లి ఏరియా ఆసుపత్రి, శ్రీకాళహస్తి, కుప్పం, పీలేరు, చిత్తూరు ప్రభుత్వ వైద్యశాలలకు పంపాలని సూచించారు. అదే విధంగా ఆయా మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని అంగన్ వాడి కేంద్రాలను పిహెచ్‌ఎన్‌లు తప్పక సందర్శించాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ నెల ఒకటో తేది నుంచి వైద్యశాలలో జన్మిస్తున్న బిడ్డలకు వైద్యశాలలోనే పుట్టినతేది సర్ట్ఫికెట్‌ను మంజూరు చేస్తున్న విధానంపై మరింత అవగాహన పెంచుకుని జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖలో బైయోమెట్రిక్ విధానం ఏర్పాటు దాదాపు పూర్తయిందని, త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఆమె తెలిపారు. కాగా ఈ సమావేశంలో ఎపిడమాలజిస్ట్ డాక్టర్ లావణ్య, జిల్లా మలేరియా నియంత్రణాధికారి దోసారెడ్డి, ఇన్‌చార్జ్ డెమో లక్ష్మి, డిపిహెచ్ ఎన్ రాణి, గణాంకాధికారులు జార్జి, అంకయ్య, హెల్త్ ఎడ్యుకేటర్ ఎం కళావతి పాల్గొన్నారు.